Site icon HashtagU Telugu

YS Sharmila : మరోసారి ఢిల్లీకి వైఎస్ షర్మిల…ఈసారి పక్కా ప్లాన్ తోనే పయనం..!!

Ys Sharmila

Ys Sharmila

వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి…వైఎస్ షర్మిల మరోసారి ఢిల్లీకి పయనం కానున్నారు. ఈనెల 21న షర్మిల ఢిల్లీకి వెళ్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈసారి పక్కా ప్లాన్ తో హస్తినకు షర్మిల వెళ్తుందంటున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందని షర్మిల ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దీనిపై తెలంగాణ గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారామె. అంతేకాదు ఢిల్లీకి వెళ్లిని సీబీఐకి ఫిర్యాదుచేశారు. అయితే ఈనెల 21 శుక్రవారం మరోసారి ఢిల్లీకి వెళ్లందుకు రెడీ అయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై చర్యలు తీసుకోవాలంటూ EDకి ఫిర్యాదు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.

ఈ మధ్యే కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి అక్రమాలపై సీబీఐకి ఫిర్యాదు చేసిన షర్మిల…కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతపై దర్యాప్తు చేసేందుకు సీబీఐ విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. సకాలంలో చర్యలు తీసుకోనట్లయితే కోర్టును ఆశ్రయిస్తానని తెలిపారు. మొత్తానికి వైఎస్ షర్మిల కాళేశ్వరం ప్రాజెక్టుల జరిగిన అవినీతిని బయటపెట్టేంత వరకు పట్టువీడేలా లేరు. శుక్రవారం ఢిల్లీ పర్యటనలో ఎలాంటి ఫిర్యాదు చేస్తారో చూడాలి.

Exit mobile version