YS Sharmila : కాంగ్రెస్ ఓట్లు చీల్చడానికి షర్మిల కుట్ర..?

  • Written By:
  • Publish Date - October 12, 2023 / 11:20 AM IST

YSRTP అధినేత్రి షర్మిల (YS Sharmila) భారీ ప్లాన్ చేసిందా..? కాంగ్రెస్ పార్టీ లో విలీనం కాకుండా చేసిన తెలంగాణ కాంగ్రెస్ నేతల ఫై పగ తీర్చుకోవాలని డిసైడ్ అయ్యిందా..? తాను ఓడిపోయిన పర్వాలేదు..కాంగ్రెస్ గెలవకూడదని అనుకుంటుందా..? అందుకే అసెంబ్లీ ఎన్నికల్లో రెండు చోట్ల నుండి పోటీకి దిగబోతుందా..? అలాగే తన తల్లి విజయమ్మను కూడా బరిలోకి దించబోతుందా..? ప్రస్తుతం ఈ ప్రశ్నలు సగటు కాంగ్రెస్ కార్యకర్త మాట్లాడుకునేలా చేస్తున్నాయి.

తెలంగాణ రాష్ట్రంలో రాజన్న పాలన తీసుకురావడమే లక్ష్యంగా వైస్ షర్మిల తెలంగాణ లో 2021 లో YSR తెలంగాణ పార్టీ (YSRTP) ని స్థాపించింది. పార్టీ పెట్టీపెట్టగానే సీఎం కేసీఆర్ ఫై యుద్ధం మొదలుపెట్టింది. ఏ పార్టీ నేతలు చేయని విధంగా కేసీఆర్ ఫై విమర్శలు చేస్తూ వార్తల్లో నిలిచింది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసి ఆకట్టుకున్నారు. నిరుద్యోగుల కోసం పెద్ద ఎత్తున దీక్షలు చేసి అందరిలో గుర్తింపు తెచ్చుకున్నారు. ఇలా పార్టీ పెట్టిన కొత్తలో గట్టిగానే పోరాటం చేసినప్పటికీ..ఈమె వెంట పెద్దగా రాజకీయ నేతలు లేకపోవడం..ఆ తర్వాత షర్మిలఫై పలు కేసులు, రెండు మూడు సార్లు అరెస్ట్ కావడం ఇదంతా జరిగింది. కానీ ఆ తర్వాత ఎందుకు సడెన్ గా సైలెంట్ అయ్యింది. ఇదే క్రమంలో కాంగ్రెస్ లో వైఎస్ఆర్ టీపీని విలీనం (YSRTP merge with Congress) చేసేందుకు చివరివరకు షర్మిల విశ్వ ప్రయత్నాలే చేశారు. కానీ, షర్మిల ప్రయత్నాలు విఫలం అయ్యాయి. షర్మిల పార్టీ విలీనం విషయంలో కాంగ్రెస్ హైకమాండ్ అంత ఇంట్రస్ట్ చూపించలేదు. దీంతో షర్మిల ఓ నిర్ణయానికి వచ్చేశారు. ఈసారి ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలనీ , మొత్తం 100 సీట్లలో తమ పార్టీ నుంచి అభ్యర్థులను పోటీలోకి దించాలని ఆమె డిసైడ్ అయినట్లు తెలుస్తుంది.

We’re now on WhatsApp. Click to Join.

ఈ ఎన్నికల్లో రెండు చోట్ల నుంచి షర్మిల పోటీ చేయాలని (Sharmila to Contest 2 Seats ) ప్లాన్ చేస్తుందట. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం పాలేరు (Paleru Constituency), మిర్యాలగూడ నియోజకవర్గాల (Miryalaguda Constituency) నుంచి షర్మిల పోటీ చేయనున్నారు. షర్మిల తల్లి విజయమ్మ (YS Vijayamma) కూడా ఈ సారి తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్లు తెలుస్తోంది. సికింద్రాబాద్‌ నుంచి వైఎస్‌ విజయమ్మ పోటీ చేయబోతున్నట్లు వినికిడి. షర్మిల రెండు చోట్ల నుండి పోటీ చేయడం..తన తల్లిని సైతం బరిలోకి దింపడం వెనుక కాంగ్రెస్‌ ఓటు బ్యాంక్‌ చీల్చడమే టార్గెట్‌గా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అంత మాట్లాడుకుంటున్నారు. కాంగ్రెస్ లో విలీనం కాకుండా అడ్డు పడ్డందుకే షర్మిల ఈ రకంగా పగ తీర్చుకోవాలని అనుకుంటున్నట్లు తెలుస్తుంది. మరి నిజంగా షర్మిల రెండు చోట్ల నుండి పోటీ చేస్తుందా..? షర్మిల ఎఫెక్ట్ కాంగ్రెస్ పార్టీ ఫై పడుతుందా..? అనేది చూడాలి.

Read Also : Telangana Assembly Polls: హైదరాబాద్ నుండి బయటకు వచ్చే దమ్ముందా?