Site icon HashtagU Telugu

YS Sharmila : అప్పుడు స్కూటర్ మీద తిరిగిండు..ఇప్పుడు విమానాలు కొంటుండు..!!

YS Murder

Sharmila

వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా సీఎం కేసీఆర్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం వైఎస్ షర్మిల చేపట్టిన పాదయాత్ర భూపాలపల్లి జిల్లాలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా షర్మిల ప్రసంగిసతూ…సీఎం కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు. కొంత కాలంగా కేసీఆర్ ఫ్యామిలీనే టార్గెట్ చేసిన షర్మిల…దేశంలోనే అత్యంత అవినీతి పాలన సాగిస్తున్న ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ అంటూ ఆరోపణలు చేశారు.

ఒక్కప్పుడు స్కూటర్ మీద తిరిగిన కేసీఆర్ ఇప్పుడు విమానాలు కొనే స్థాయికి ఎలా ఎదిగాడంటూ షర్మిల ప్రశ్నించారు. ఏం కష్టం చేశాడని…ఇన్ని కోట్లు సంపాదించాడు. తెలంగాణలో కల్వకుంట్ల కుటుంబం తప్పా ఏ ఒక్క కుటుంబం బాగుపడిన దాఖలాలు లేవన్నారు. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్రవెంకటరమణపై నిప్పులు చెరిగారు. గండ్ర వెంకటరమరణ కోట్లకు పడగెత్తారని..ప్రజలను ఇంకెంత కాలం ఇబ్బందులకు గురిచేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దోచుకోవడం, దాచుకోవడం మీద ఉన్న శ్రద్ధ సమస్యలపై లేదన్నారు.

పాలకులు మొద్దు నిద్రలో ఉంటే పోలీసులు ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేవారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలే లేవన్న షర్మిలా ఉన్నది తమ పార్టీ ఒక్కటే అన్నారు.

Exit mobile version