Site icon HashtagU Telugu

YS Sharmila: కేటీఆర్ విదేశాల్లో అబద్దాల పాఠాలు: వైఎస్ షర్మిల

YS Sharmila

New Web Story Copy 2023 06 07t170303.634

YS Sharmila: తెలంగాణ రాజకీయాల్లో వైఎస్ షర్మిల ప్రస్థానం కొనసాగుతుంది. తెలంగాణాలో రాజన్న రాజ్యం తీసుకొచ్చేందుకు పార్టీ స్థాపించిన ఆమె అధికార పార్టీ బీఆర్ఎస్ పై ఎప్పటికప్పుడు విమర్శలు చేస్తూ వార్తల్లో నిలుస్తుంది. రాష్ట్రంలో పార్టీ గెలుపు పక్కనపెడితే అధికార పార్టీ తప్పిదాలను ఎండగట్టడంలో ఆమె ఇప్పటికే విజయం సాధించింది. తెలంగాణాలో ఏ చిన్న సమస్య వచ్చినా అక్కడికి వాలిపోతున్నది. ఈ క్రమంలో సీఎం కెసిఆర్, మంత్రి కేటీఆర్ లను టార్గెట్ చేస్తూ అధికార పార్టీకి తలనొప్పిగా మారుతున్నారు షర్మిల. తాజగా ఆమె మంత్రి కేటీఆర్ పై ఆరోపణలు చేశారు.

కేటీఆర్ గారు… కాళేశ్వరం ప్రాజెక్టు మీద విదేశాలకు మీరు నేర్పే పాఠాలు ఇవే కదా అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు షర్మిల. రూ.38,500 కోట్ల ప్రాజెక్ట్ ను రూ.1.20 లక్షల కోట్లకు ఎలా పెంచాలి అన్నది మీకు మాత్రమే తెలుసు. ఇదే కదా మీరు విదేశాల్లో చెప్పుకుంటున్నది అన్నారు. ఈ ప్రాజెక్టులో 70 వేల కోట్ల కమీషన్లు ఎలా తినాలో కూడా మీరే నేర్పించారు అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అడిగినన్ని కమీషన్లు ఇచ్చే “మెగా ” మోసం చేసే కంపెనీలకు ఎలా కాంట్రాక్ట్ ఇవ్వాలో కూడా మీకే తెలుసు. 18 లక్షల ఎకరాలకు నీళ్లు అని చెప్పి లక్ష ఎకరాలకే నీళ్లు ఇచ్చి మోసం చేశారు. ఇంజనీర్లను పక్కన పెట్టి మనమే ఎలా ఇంజనీర్లు అవ్వాలి అనేది కూడా మీరే సృష్టించారు కదా అంటూ షర్మిల ఘాటైన విమర్శలకు పాల్పడ్డారు.

ఇక ప్రాజెక్టుల విషయానికి వస్తే… పాత ఆయకట్టును కొత్త ఆయకట్టుగా ఎలా కనికట్టు చేయాలి, ప్రాజెక్ట్ కట్టిన మూడేండ్లకే ఎలా మునిగిపోవాలి, ప్రాజెక్ట్ మునిగింది అని మళ్లీ రిపేర్ల పేరుతో ఎలా దోచుకుతినాలి, ఎవరైనా ప్రశ్నిస్తే అడ్డం పొడుగు మాటలు ఎలా చెప్పాలి, ప్రాజెక్టులను చూద్దాం అని పోతే పోలీసులను పెట్టి ఎలా ఆపాలి ఇవన్నీ మీరు నేర్పిన పాఠాలే కదా కేటీఆర్ అంటూ విమర్శల వర్షం కురిపించారు షర్మిల.

Read More: Famous Foods: ఆ దేశాలలో ఈ ఫుడ్స్ బాగా ఫేమస్.. ఒక్కసారైనా ట్రై చేయాల్సిందే?