Sharmila Shoe Challenge: షర్మిల ఫైర్.. కేసీఆర్ కు ‘బూటు’ సవాల్!

సీఎం కేసీఆర్ (CM KCR), బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలే లక్ష్యంగా సవాల్ విసురుతోంది. తాజాగా మరోసారి షర్మిల కేసీఆర్ పై ఫైర్ అయ్యారు.

Published By: HashtagU Telugu Desk
Sharmila

Sharmila

తెలంగాణ సీఎం కేసీఆర్‌పై వైఎస్సాఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) మరింత దూకుడుగా వ్యవహరిస్తున్నారు. సీఎం కేసీఆర్ (CM KCR), బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలే లక్ష్యంగా సవాల్ విసురుతోంది. తాజాగా మరోసారి షర్మిల కేసీఆర్ పై ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో ఎలాంటి సమస్యలు లేవని కేసీఆర్ నిరూపిస్తే.. తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని అన్నారు. అది నిజం కాకపోతే కేసీఆర్ సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తన పాలనపై తనకు నమ్మకం ఉంటే తనతో ఒక్కరోజు పాదయాత్ర (Padayatra)కు రావాలంటూ కేసీఆర్‌కు షూ గిఫ్ట్‌గా ఇచ్చారు. కేసీఆర్‌కు సైజ్ సరిపోకుంటే చెప్పాలని, రిటర్న్ ఆప్షన్ కూడా ఉందని ఆసక్తికర కామెంట్లు చేశారు.

‘సీఎం కేసీఆర్ ఇది బంగారు తెలంగాణ (Telangana) అని, ఎలాంటి సమస్యలు లేవని చెప్పారు. ఆయన నాతో పాటు పాదయాత్రలో నడవవాలని షూ బాక్స్ పంపిస్తున్నా. ఆయన చెప్పినట్టు రాష్ట్రంలో ఎలాంటి సమస్యలు లేవని చూపిస్తే నేను ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పి రాజకీయాల నుంచి తప్పుకుంటా. ఇది నిజం కాకపోతే, కేసీఆర్ రాజీనామా చేసి రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఆయన ఇచ్చిన మాట ప్రకారం దళితుడిని సీఎం చేయాలి. వైఎస్సార్ హయాంలో సామాన్యులు సైతం సీఎంను కలిసే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు నాయకులే కలిసే పరిస్థితి లేదు.’ అని వైఎస్ షర్మిల (YS Sharmila) వ్యాఖ్యనించారు.

కేసీఆర్ పాలనలో ఏ తెలంగాణలోని ఏ వర్గం సంతోషంగా లేదని షర్మిల అన్నారు. రైతుబంధు (Rythu Bandhu) పేరుతో ఇతర పథకాలను నిలిపివేశారని.. లక్ష రూపాయల రుణమాఫీ హామీ ఏమైందని ఆమె ప్రశ్నించారు. రైతుల (Formers)కు రూ.5 వేలు ఇచ్చి రూ.30 వేల సబ్సిడీ ఆపేశారని షర్మిల ధ్వజమెత్తారు. అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కేసీఆర్.. ఆ తర్వాత వాటిని గాలికొదిలేశారని మండిపడ్డారు. నేరవర్చలేనప్పుడు వాగ్ధానాలు ఎందుకు ఇచ్చారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ ఏడాది ఏ పథకం ప్రవేశ పెట్టిన అది ఎన్నికల కోసమేనని మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిపై ఎమ్మెల్యేలు వారి నియోజకవర్గాల్లో పబ్లిక్ ఫోరం నిర్వహించాలని ఆమె డిమాండ్ చేశారు. అప్పుడే వాస్తవాలు తెలుస్తాయని అన్నారు. సీఎం కేసీఆర్‌ను గద్ద దించటమే తన ఏకైక లక్ష్యమని షర్మిల (YS Sharmila) వ్యాఖ్యనించారు.

Also Read: Komatireddy Venkat Reddy: కోమటిరెడ్డి కొత్త డిమాండ్.. అనుచర వర్గానికి పీసీసీ పోస్టులు?

  Last Updated: 02 Feb 2023, 05:31 PM IST