Site icon HashtagU Telugu

YS Sharmila: తెలంగాణపై వైఎస్ ష‌ర్మిల సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

Sharmila

Sharmila

YS Sharmila: తెలంగాణపై వైఎస్ఆర్‌టీపీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణ ఓ విష‌యంలో నెంబ‌ర్ వ‌న్ స్థానంలో ఉంద‌ని ఆమె విమ‌ర్శలు కురిపించారు. రేప్‌లు చేయడంలో భార‌త్‌దేశంలో తెలంగాణనే నెంబ‌ర్ వ‌న్‌ అని ష‌ర్మిల క‌ల‌క‌లం సృష్టించే వ్యాఖ్య‌లు చేశారు. షాద్‌న‌గర్ వైయస్సార్ సర్కిల్ వద్ద వైఎస్ఆర్‌టీపీ నాయ‌కులు భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఆ సభలో భాగంగా వైఎస్ షర్మిల పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పాలన చేప‌ట్టి 8 సంవ‌త్స‌రాలు అవుతుంది. 8 సంవ‌త్స‌రాల నుంచి సీఎం కేసీఆర్ రాష్ట్రం ప్ర‌జ‌ల‌ను మోసం చేస్తున్నార‌ని అన్నారు. సీఎం కేసీఆర్ చేతిలో మోస‌పోని వారంటూ ఎవ‌రూ లేర‌ని, పోలీసుల‌ను కేసీఆర్ త‌న పనివాళ్లుగా వాడుకుంటున్నారని ఆరోపించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి ఆర్ఎస్ఎస్ ఎలానో.. కేసీఆర్‌కు పోలీసులు అలాగా అంటూ ఆమె ఎద్దేవా చేశారు.

ఈ క్ర‌మంలోనే మంత్రి శ్రీనివాస్ గౌడ్‌పై కూడా విమ‌ర్శ‌నాస్త్రాలు చేశారు. ఆయ‌న మ‌ద్యం మంత్రి అని.. శ్రీనివాస్ హ‌యాంలో మ‌ద్యం అమ్మ‌కాలు పెరిగి స్త్రీల‌పై అనేక‌ర‌క‌మైన దాడులు ఎక్కువైతుంటే చ‌ర్య‌లేవ‌ని అన్నారు. అధికారంలోకి వ‌చ్చిన 4 నెల‌ల్లోనే ముస్లిం సోద‌రుల‌కు 12శాతం రిజ‌ర్వేష‌న్ క‌ల్పిస్తాన‌న్న సీఎం కేసీఆర్ ఆ హామీని ఏం చేశారో అని ఫైర్ అయ్యారు. అయితే ష‌ర్మిల చేసిన ఈ వ్యాఖ్య‌ల‌పై టీఆర్ఎస్ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు ఎలా స్పందిస్తారో చూడాలి.