Site icon HashtagU Telugu

YS Sharmila : తన కుమారుడి గ్రాడ్యుయేషన్ ఫొటోలు షేర్ చేసిన షర్మిల..!!

Ys Sharmila Son

Ys Sharmila Son

వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల…తన కుమారుడు రాజారెడ్డి గ్రాడ్యుయేషన్ పట్టా అందుకున్నాడని తెలుపుతూ ట్వీట్ చేశారు. రాజా నీ గ్రాడ్యుయేషన్ పూర్తయినందుకు అభినందనలు…నా చేతుల్లో పెరిగిన నువ్వు ఇప్పుడు ఇంతటి వాడివయ్యావు…నాకు చాలా సంతోషంగా ఉందని షర్మిల పేర్కొంది. దయార్థ మనస్సుతో నీ చుట్టూ ఉన్నవారి పట్ల ఎప్పుడూ గౌరవభావంతో మెలుగుతూ ఉండు… ఆ దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నిన్ను చూసి చాలా గర్విస్తున్నాను అని ట్వీట్ చేశారు. ఈ సందర్బంగా తన కుమారుడికి సంబంధించిన ఫొటోలను పోస్టు చేశారు షర్మిల. ఈ గ్రాడ్యుయేషన్ డేలో అనిల్, విజయమ్మ, రాజారెడ్డి సోదరి ఉన్నారు.