Site icon HashtagU Telugu

YS Sharmila : హోంగార్డ్ రవీందర్ హత్యపై వైఎస్ షర్మిల కామెంట్స్.. కేసీఆర్ నియంత పాలనలో మరో ప్రాణం..

Ys Sharmila sensational comments on KCR regarding Home Gaurd Ravindar Death

Ys Sharmila sensational comments on KCR regarding Home Gaurd Ravindar Death

ఇటీవల నాలుగు రోజుల క్రితం సకాలంలో జీతం అందక బ్యాంకు ఈఎంఐ చెల్లింపు ఆలస్యమైందన్న మనస్తాపంతో అధికారుల ముందే ఒంటిపై పెట్రోల్‌ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసుకున్న హోంగార్డ్ రవీందర్ (Home Guard Ravinder ) చికిత్స పొందుతూ ఈరోజు కన్నుమూశారు. సకాలంలో జీతాలు ఇవ్వకపోవడం వల్ల, ఆర్ధిక ఇబ్బందులు తట్టుకోలేకే హోంగార్డు ఆత్మహత్య చేసుకున్నాడని సమాచారం.

అయితే సకాలంలో జీతాలు ఇవ్వకపోవడం వల్లే హోంగార్డ్ చనిపోవడంతో ప్రతిపక్షాలు కేసీఆర్(KCR) ప్రభుత్వం పై ఫైర్ అవుతున్నారు. కనీసం జీతాలు కూడా సరిగ్గా చెల్లించట్లేదని ఫైర్ అవుతున్నారు. ఇప్పటికే బీజేపీ(BJP), కాంగ్రెస్(Congress) నాయకులు రాష్ట్ర ప్రభుత్వంపై ఫైర్ అవ్వగా తాజాగా వైఎస్సార్ తెలంగాణ పార్టీ(YSRTP) అధ్యక్షురాలు షర్మిల(YS Sharmila) ఫైర్ అయింది.

వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ నియంత పాలనలో మరో నిండు ప్రాణం బలైపోయింది. రాష్ట్రాన్ని 5 లక్షల కోట్ల అప్పుల పాలు చేసినా హోం గార్డులకు సకాలంలో జీతాలు ఇవ్వాలన్న మనసు లేకపోవడం బాధాకరం. పాతబస్తీకి చెందిన హోంగార్డు రవీందర్ సకాలంలో జీతం అందక పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. రవీందర్ చావుకు ముమ్మాటికీ కేసీఆర్ ప్రభుత్వమే కారణం. హోంగార్డులకు డబుల్ బెడ్ రూం ఇండ్లన్నారు, హెల్త్ కార్డులన్నారు, జీతాలు పెంచుతమని ప్రగల్భాలు పలికారు. హోంగార్డుల జీవితాలు మారుస్తామని అసెంబ్లీ సాక్షిగా పచ్చి అబద్దాలు చెప్పారు. హోంగార్డులను రెగ్యులరైజ్ చేస్తామని కేసీఆర్ 2017లో హామీ ఇచ్చినా నేటికీ చేయలేదు.

సమయానికి జీతాలు రావు, కనీస గౌరవం లేదు. నీ నిర్లక్ష్యానికి ఇంకెన్ని ప్రాణాలు బలవ్వాలి దొరా. హామీ ఇచ్చిన విధంగా 20 వేల మంది హోంగార్డులను తక్షణమే పర్మినెంట్ చేసి, డబుల్ బెడ్ రూం ఇండ్లు, హెల్త్ కార్డులు ఇచ్చి మాట నిలబెట్టుకోండి. ఆత్మహత్య చేసుకున్న రవీందర్ కుటుంబానికి 50 లక్షల పరిహారం చెల్లించి, అతని భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కేసీఆర్ ను డిమాండ్ చేస్తున్నాం అని షర్మిల ఫైర్ అయింది.

ఇక మరోవైపు కుటుంబ సభ్యులు మాత్రం రవీందర్ ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదు. పై ధికారులు అతన్ని హత్య చేశారని అంటున్నారు.

 

Also Read : Revanth Reddy: హోంగార్డు రవీందర్‌ది ఆత్మహత్య కాదు, కేసీఆర్ చేసిన హత్య: రేవంత్ రెడ్డి