Site icon HashtagU Telugu

Telangana: కేసీఆర్.. దమ్ముంటే గజ్వేల్ నుంచి గెలిచి చూపించు

Ys Sharmila

Ys Sharmila

Telangana: ఎన్నికలు సమీపిస్తున్న వేళ సీఎం కేసీఆర్ తన రాజకీయ చతురతకు పదునుపెడుతున్నారు. హ్యాట్రిక్ విజయంపై కన్నేసిన కెసిఆర్ అదే స్థాయిలో రాజకీయాలకు పదునుపెడుతున్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు ధీటుగా తన కార్యాచరణ ఉండబోతుందని అంటున్నాయి బీఆర్ఎస్ వర్గాలు. ఇక నిన్న సోమవారం సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. సీఎం కేసీఆర్ ఈ సారి గజ్వేల్, కామారెడ్డి రెండు చోట్ల నుంచి పోటీ చేయనున్నట్టు ప్రకటించారు.

సీఎం కేసీఆర్ గజ్వేల్ లో పోటీపై వైఎస్ షర్మిల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గజ్వేల్ ఓటర్లు తన్ని తరిమేస్తారని దొరకు బాగా అర్థమైనట్టుందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అందుకే ముందు జాగ్రత్తగా రెండో స్థానం నుంచి పోటీ చేస్తున్నాడని తెలిపారు.స్వయానా ముఖ్యమంత్రికే సొంత నియోజకవర్గంలో గెలుస్తాననే దమ్ము లేకపోవడం కేసీఆర్ పదేళ్ల దిక్కుమాలిన పరిపాలనకు నిదర్శనమని ఎద్దేవా చేశారు షర్మిల. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి డిపాజిట్లు కూడా రావు అనడానికి ఇదే సంకేతమని చెప్పారు. దొర గారు ఇన్నాళ్లు గజ్వేల్ ప్రజలను కలిసింది లేదు.. వాళ్ల గోసలు తెలుసుకున్నది లేదు.. పేరుకు ముఖ్యమంత్రి నియోజకవర్గమైనా డబుల్ బెడ్ రూం ఇండ్లు రాకపాయే.. దళిత బంధు అందకపాయే.. ఇక దొర గజ్వేల్ లో చూపెట్టే అభివృద్ధి అంతా ఖాళీ బిల్డింగులే.. రాష్ట్రానికే ముఖ్యమంత్రిని అన్న అహంకారంలో కేసీఆర్ గజ్వేల్ కి ఎమ్మెల్యే అన్న సంగతి ఏనాడో మరిచిపోయిండు.. కేసీఆర్ కు నిజంగా దమ్ముంటే.. తన పరిపాలన మీద తనకు నమ్మకం ఉంటే.. సొంత నియోజకవర్గం గజ్వేల్ నుంచే గెలిచి చూపించాలని షర్మిల సవాల్ విసిరారు.

Also Read: Chandrayaan-3: చంద్రయాన్-3 పోస్టుపై ప్రకాష్ రాజ్ క్లారిటీ

Exit mobile version