YS Sharmila : ఏపీలో పార్టీ పెట్ట‌చ్చు.. ష‌ర్మిల సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. మీడియాతో చిట్‌చాట్ సంద‌ర్భంగా ఆమె ఏపీ రాజ‌కీయాల‌పై స్పందించారు. ఏపీ లో పార్టీ పెడుతున్నారా అని ఓ రిపోర్ట‌ర్ అడిగిన ప్ర‌శ్న‌కు స‌మాధానంగా రాజకీయ పార్టీ ఎక్కడైనా పెట్టొచ్చు అన్నారు ష‌ర్మిల‌

Published By: HashtagU Telugu Desk
Ys Sharmila

Ys Sharmila

వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. మీడియాతో చిట్‌చాట్ సంద‌ర్భంగా ఆమె ఏపీ రాజ‌కీయాల‌పై స్పందించారు. ఏపీ లో పార్టీ పెడుతున్నారా అని ఓ రిపోర్ట‌ర్ అడిగిన ప్ర‌శ్న‌కు స‌మాధానంగా రాజకీయ పార్టీ ఎక్కడైనా పెట్టొచ్చు అన్నారు ష‌ర్మిల‌. పెట్టకూడదని రూల్ ఏం లేద‌ని, తాము ఒక మార్గాన్ని ఎంచుకున్నామ‌న్నారు. ఈ నెల 19 లేదా 20 నుంచి పాదయాత్రకు సన్నహాలు చేస్తున్న‌ట్టు చెప్పారు. రైతు ఆవేదన యాత్ర కి అనుమతి ఇవ్వ‌ని టీఆరెస్ స‌ర్కార్‌..రైతు బంధు పండుగలకు మాత్రం నిబంధనలు అడ్డు రావని అన్నారు. ప్రతిపక్షాల గొంతు నొక్కెందుకే నిబంధనలు పెడుతున్నార‌ని, రాష్ట్రంలో మిగ‌తా ఇష్యూల‌ను డైవర్ట్ చేసేందుకు బీజేపీ నీ కేసీఆర్ టార్గెట్ చేస్తున్నార‌ని మండిప‌డ్డారు.

  Last Updated: 03 Jan 2022, 01:08 PM IST