Site icon HashtagU Telugu

YS Sharmila: ఢిల్లీకి వైఎస్ షర్మిల…వారిని కలిసేందుకేనా?

Ys Sharmila

Ys Sharmila

తెలంగాణ రాజకీయాల్లో జోరు పెంచారు వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. పాదయాత్రతో తెలంగాణను చుట్టుముట్టుతున్న షర్మిల ఇప్పుడు సడెన్ గా ఢిల్లీకి వెళ్లారు. బీజేపీ పెద్దలను కలిసేందుకే ఢిల్లీకి వెళ్లినట్లుగా తెలుస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందని వాటిపై ఆధారాలను బీజేపీ పెద్దలకు ఇస్తారని YSRTP వర్గాలు అంటున్నాయి. అందుకే పాదయాత్ర నిలిపివేసి..రెండు రోజుల పర్యటనకు ఢిల్లీ వెళ్లినట్లుగా వెల్లడించాయి.

కాగా కాళేశ్వరం గురించి ఇప్పటికే బీజేపీ వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని…షర్మిల ఖచ్చితంగా రాజకీయ అంశాల గురించి చర్చించేందుకే హస్తికి వెళ్లారన్న మాట వినిపిస్తోంది. ఈ మధ్యే తన తండ్రిని కుట్ర చేసి చంపారని తనను కూడా చంపే అవకాశాలున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు షర్మిల. ఈ పరిణామాలన్నింటి మధ్య బీజేపీ నేతలత చర్చల కోసం ఢిల్లీ వెళ్లడం తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు కీలక పరిణామంగా కనిపిస్తోంది. అయితే ఢిల్లీలో ఏ స్థాయి బీజేపీ నేతలతో షర్మిల సమావేశం అవుతున్నారన్న విషయంపై పార్టీ క్లారిటీ ఇవ్వలేదు.