Site icon HashtagU Telugu

YS Sharmila: కేసీఆర్ కు షాక్.. రేవంత్, బండికి షర్మిల ఫోన్!

T Politics

T Politics

తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు కొత్త మలుపు తిరుగబోతున్నాయి. కేసీఆర్ ను ఢీకొట్టాలంటే ప్రతిపక్షాలు ఏకం కావాలనే ప్రాతిపాదనను వైఎస్సాఆర్ టీపీ అధినేత వైఎస్ షర్మిల లేవనెత్తారు. ఈ మేరకు షర్మిల బండి సంజయ్, రేవంత్ రెడ్డికి ఫోన్ చేశారు.  కేసీఆర్ మెడలు వంచాలి అంటే ప్రతిపక్షాలు ఏకం కావాలని. కలిసి పోరాటం చేయక పోతే ప్రతిపక్షాలను తెలంగాణలో కేసీఆర్ బ్రతకనివ్వరని తెలిపారు. షర్మిల ఫోన్‌కాల్‌పై బండి సంజయ్, రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది.

నిరుద్యోగ స‌మ‌స్య‌ల‌పై క‌లిసిపోరాడ‌దామ‌ని వాళ్లిద్ద‌రిని ష‌ర్మిల కోరారు. ఉమ్మ‌డి కార్యాచ‌ర‌ణ‌కు సిద్ధ‌మ‌వుతామ‌ని పిలుపునిచ్చారు. అలాగే ప్ర‌గ‌తిభ‌వ‌న్ మార్చ్‌కు పిలుపునిద్దామ‌ని ఆ ఇద్ద‌రు నేత‌ల ఎదుట ప్ర‌తిపాదించారు. కేసీఆర్ మెడ‌లు వంచాలంటే ప్ర‌తిప‌క్షాల‌న్నీ ఏకం కావాల‌ని ష‌ర్మిల కోరారు. ప్ర‌తిప‌క్షాల‌న్నీ ఐక్యంగా పోరాటం చేయ‌క‌పోతే ఎవ‌ర్నీ బ‌త‌క‌నివ్వ‌ర‌నే బండి సంజ‌య్‌, రేవంత్‌ల‌తో త‌న అభిప్రాయాన్ని ష‌ర్మిల కుండ‌బ‌ద్ద‌లు కొట్టిన‌ట్టు చెప్పారు.

ఉమ్మడిగా పోరాటం చేసేందుకు బండి సంజయ్ మద్దతు తెలిపారు. త్వరలో సమావేశం అవుదామని చెప్పారు. నిరుద్యోగుల విషయంలో ఉమ్మడి పోరాటానికి పూర్తి మద్దతు ఉంటుందని బీజేపీ నేత స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు కలిసి పోరాటం చేయాల్సిన సమయం ఏర్పడిందని రేవంత్ రెడ్డి కూడా అన్నట్లు తెలుస్తోంది.  ఒకవేళ రేవంత్ రెడ్డి, బండి సంజయ్, వైఎస్ షర్మిల ఒకే వేదికమీదికి వస్తే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు కొత్త మలుపు తిరగడం ఖాయమనే అభిప్రాయం ప్రజల్లో ఉంది.

టీఎస్పీఎస్సీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం సరికాదని వైఎస్ షర్మిల మండిపడ్డారు. ఈ వ్యవహారాన్ని మంత్రి కేటీఆర్ కేవలం ఇద్దరికి మాత్రమే ముడిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. పేపర్ లీకైనట్లుగా 2017 నుంచి వార్తలు వస్తున్నాయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ సరిగ్గా విచారణ చేయడం లేదని షర్మిల అన్నారు. ఈ కేసులో స్పష్టమైన ఆధారాలు సేకరించడంలో విఫలమవుతోందని ఆరోపించారు. ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాలపైనా కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.