Site icon HashtagU Telugu

YS Sharmila:షర్మిల పార్టీలోకి అధికారపార్టీ నేతలు

sharmila

షర్మిల పార్టీలో వివిధ పార్టీల నాయకుల చేరికలు జరుగుతున్నాయి. అధికార పార్టీ వైఫల్యాలను ఎండగడుతున్న వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల గారి నాయకత్వంలో పనిచేసేందుకు పలు పార్టీల నాయకులు ముందుకొస్తున్నారని, ప్రతిపక్ష పార్టీలోంచే కాకుండా అధికార పార్టీ టీఆర్ఎస్ నుంచి కూడా పలువురు నాయకులు షర్మిల పార్టీలో చేరుతున్నారని ఆ పార్టీ నాయకులు తెలిపారు.

మహేశ్వరం నియోజకవర్గం టీఆర్ఎస్ ఉపాధ్యక్షులు ఎడమ మోహన్ రెడ్డి తన అనుచరులతో కలిసి వైఎస్సార్ తెలంగాణ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. మలక్ పేట్ బీజేపీ నాయకులు, ట్రేడర్ సెల్ సిటీ అధ్యక్షుడు తన అనుచరులతో కలిసి షర్మిల పార్టీలో జాయిన్ అయ్యారు.

అంతగా లెజిటమసి ఉన్న నాయకులు కాకపోయినా షర్మిల పార్టీలో చేరికల అంశం కొంచెం ఆసక్తికర అంశమే. షర్మిలకు ఇప్పటికిప్పుడు అద్భుతాలు సృష్టించే సీన్ లేకపోయినా ఇలా చిన్నాచితకా నాయకుల చేరిక పార్టీ కార్యకర్తల్లో ఒక జోష్ అయితే నింపే ఛాన్స్ ఉంటుంది. ఈ చేరికలు ఇలాగే కొనసాగితే ఎన్నికల వరకు పార్టీ కొంచెం పుంజుకొని ఇతర పార్టీల్లో టికెట్ ఆశించి భంగపడ్డ వారికి షర్మిల పార్టీ పునరావాస కేంద్రంగా మారే అవకాశముంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Exit mobile version