YS Sharmila: చిన్న దొరా… ఇదే నా సవాల్

చిన్న దొర... చిన్న దొర అంటూ మంత్రి కేటీఆర్ ని ఉద్దేశించి వైస్ షర్మిల పెట్టే పోస్టులు ఆసక్తికరంగా మారుతున్నాయి. ట్విట్టర్ లో యమ యాక్టీవ్ గా ఉండే వైఎస్ఆర్టీపి పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల

Published By: HashtagU Telugu Desk
YS Sharmila

New Web Story Copy 2023 06 30t164141.341

YS Sharmila: చిన్న దొర… చిన్న దొర అంటూ మంత్రి కేటీఆర్ ని ఉద్దేశించి వైఎస్ షర్మిల పెట్టే పోస్టులు ఆసక్తికరంగా మారుతున్నాయి. ట్విట్టర్ లో యమ యాక్టీవ్ గా ఉండే వైఎస్ఆర్టీపి పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలంగాణ ప్రభుత్వంపై ఎప్పటికప్పుడు హాట్ హాట్ కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. సీఎం కెసిఆర్ పాలనను ఎండగడుతూ ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తుంటారు షర్మిల. తాజాగా మంత్రి కేటీఆర్ ని టార్గెట్ చేస్తూ ఆమె ట్విట్టర్లో పోస్ట్ పెట్టారు.

వైఎస్ షర్మిల మాట్లాడుతూ… చిన్నదొర కేటీఆర్ గారు… వైయస్ఆర్ ఇమేజ్ ప్రో పూర్, ప్రో ఫార్మర్, ప్రో అగ్రికల్చర్ అయితే..కేసీఆర్ కి ఉన్న ఇమేజ్ యాంటీ ఇమేజ్ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు ఆమె. కేసీఆర్ కున్న ఇమేజ్ యాంటి పూర్, కేసీఆర్ ఒక యాంటి ఫార్మర్, కేసీఆర్ పాలన యాంటి యూత్, కేసీఆర్ ప్రభుత్వం యాంటి ఉమెన్, కేసీఆర్ అంటే యాంటి మైనారిటీస్, కరప్షన్ అంటే కేసీఆర్.. కేసీఆర్ అంటే కరప్షన్ అంటూ మండిపడ్డారు.

నాగలోకానికి, నక్కకు ఎంత తేడా ఉందో వైయస్ఆర్ పాలనకు, కేసీఆర్ పాలనకు అంత తేడా ఉందన్నారు షర్మిల. 9 ఏండ్ల పాలనలో రాష్ట్రం సమతుల్య అభివృద్ధి అని చెప్తున్న కేటీఆర్ నీకొక సవాల్ అంటూ షర్మిల సవాల్ విసిరారు. మీ తండ్రి కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల స్కాం , మీ చెల్లి కవిత లిక్కర్ స్కాం, మీరు రియలెస్టేట్ స్కాం చేయలేదని మీరు సుద్దపూసలని నిరూపించుకునే దమ్ముందా..అంటూ సవాల్ విసిరారు షర్మిల.

Read More: Bengaluru: బెంగుళూరులో బతకాలి అంటే ఎంత జీతం కావాలో తెలుసా?

  Last Updated: 30 Jun 2023, 04:44 PM IST