YS Sharmila: పొంగులేటిని కలిసిన షర్మిల.. కుమారుడి వివాహానికి రావాలని ఆహ్వానం

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నాయకురాలు వైస్ షర్మిల తన కుమారుడు రాజారెడ్డి వివాహంలో బిజీబిజీగా గడుపుతున్నారు. ఓవైపు రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తూనే కుమారుడి వివాహానికి సంబంధించి

YS Sharmila: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నాయకురాలు వైఎస్ షర్మిల తన కుమారుడు రాజారెడ్డి వివాహంలో బిజీబిజీగా గడుపుతున్నారు. ఓవైపు రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తూనే కుమారుడి వివాహానికి సంబంధించి పనుల్ని దగ్గరుండి చేసుకుంటున్నది. ఈ క్రమంలో రాజారెడ్డి వివాహ ఆహ్వానపత్రికను ప్రముఖులకు ఇస్తూ ఆహ్వానిస్తున్నది. ఇప్పటికే అన్న ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ తో భేటీ అయిన ఆమె మేనల్లుడి వివాహానికి హాజరవ్వాల్సిందిగా కోరింది. అనంతరం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి కుమారుడి వివాహ ఆహ్వాన పత్రికను అందజేసి ఆహ్వానించింది. అంతేకాకుండా పలువురు రాజకీయ నేతలు, ప్రముఖులకు ఆహ్వాన పత్రికను అందజేసింది.

వైఎస్ షర్మిల తాజాగా తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని హైదరాబాద్ లోని ఆయన నివాసంలో కలిశారు. తన కుమారుడు రాజారెడ్డి వివాహానికి కుటుంబ సమేతంగా హాజరై.. నూతన వధూవరులను ఆశీర్వదించాలని కోరుతూ వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు.

వైస్ఆర్టీపి పార్టీని స్థాపించిన వైఎస్ షర్మిల ప్రస్తుతం ఆ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి కాంగ్రెస్ నేతగా కొనసాగుతున్నది. త్వరలో ఆమెకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పగ్గాలు ఇచ్చే అవకాశముంది. ఇప్పటికే రాహుల్, ప్రియాంక, సోనియా గాంధీలను కలిసిన షర్మిల పార్టీలో సముచిత స్థానాన్ని కోరింది. దానికి ఢిల్లీ పెద్దలు సానుకూలంగా స్పందించడంతోనే షర్మిల తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసినట్లు తెలుస్తుంది.

Also Read: Health: ఒత్తైన జట్టు కావాలనుకుంటున్నారా.. అయితే టిప్స్ ఫాలోకండి