Site icon HashtagU Telugu

YS Sharmila Meets CM Revanth : సీఎం రేవంత్ తో వైస్ షర్మిల భేటీ

Sharmila Meets Revanth

Sharmila Meets Revanth

ఏపీసీసీ చీఫ్ వైస్ షర్మిల (YS Sharmila)..సోమవారం రాత్రి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy To) తో భేటీ అయ్యారు. తెలంగాణలో కృష్ణా జలాల అంశం(Krishna Water Issue)పై తీవ్ర చర్చ నడుస్తున్న సమయంలో అనూహ్యంగా షర్మిల..సీఎం రేవంత్ ను కలవడం ఆసక్తి రేపుతోంది. కృష్ణా జలాలను కేసీఆర్‌ ఏపీకి తరలించారని.. నాడు సీఎం జగన్‌కు మాటిచ్చారని పదే పదే ప్రస్తావిస్తున్న నేపథ్యంలో రేవంత్‌ రెడ్డితో షర్మిల సమావేశం కావడం విశేషం. ఏపీ కాంగ్రెస్‌ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి మర్యాదపూర్వకంగా రేవంత్‌రెడ్డిని కలిసినట్లు ఆమె ‘ఎక్స్’ (ట్విటర్‌) వేదికగా వెల్లడించారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ సందర్భంగా రేవంత్‌ సతీమణితో కూడా షర్మిల సమావేశమయ్యారు. దాదాపు 30 నిమిషాలకు పైగా రేవంత్‌, షర్మిల చర్చించుకున్నారని సమాచారం. ఈ సందర్భంగా ఏపీ రాజకీయాలతోపాటు తెలంగాణలో పరిణామాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఏపీలో రాజకీయ పరిస్థితులను రేవంత్‌ స్వయంగా అడిగి తెలుసుకున్నారని , ప్రస్తుతం పార్టీ పరిస్థితులు ఎలా ఉన్నాయి..? అసెంబ్లీ ఎన్నికలపై కూడా రేవంత్‌ ఆరా తీసినట్లు సమాచారం. గతంలో తన కొడుకు రాజారెడ్డి పెళ్లికి ఆహ్వానించేందుకు షర్మిల సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన సంగతి తెలిసిందే.

ఇక ఏపీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన దగ్గరి నుండి ఏపీలో షర్మిల దూకుడు కనపరుస్తున్న సంగతి తెలిసిందే. వరుస యాత్రలతో ప్రజలకు దగ్గర అవుతూ..మళ్లీ కాంగ్రెస్ ఫై నమ్మకం కలిగేలా చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా , పోలవరం పూర్తి , నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు , ధరల తగ్గుదల , రాష్ట్ర అభివృద్ధి , పరిశ్రమల ఏర్పాటు తదితర వంటివి వస్తాయని ప్రజలకు తెలియజేస్తూ వస్తుంది. ఇదే క్రమంలో అధికార పార్టీ వైసీపీ ఫై , తన అన్న జగన్ ఫై నిప్పులు చెరుగుతూ..తనదైన మార్క్ కనపరుస్తున్నారు.

Read Also : IPS Officers Transferred : తెలంగాణలో పెద్ద ఎత్తున ఐపీఎస్‌ల బదిలీ.. రాచకొండ సీపీగా తరుణ్‌జోషి