వైస్ షర్మిల (YS Sharmila )..తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ( CM Revanth) ని కలిసింది. రేవంత్ రెడ్డి.. సీఎం గా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొట్ట మొదటిసారిగా షర్మిల భేటీ కావడం జరిగింది. శనివారం సాయంత్రం సీఎం ఇంటికి వెళ్లిన షర్మిల.. రేవంత్ రెడ్డిని కలిసి తన కుమారుడి (Raja Reddy) వివాహానికి (Wedding) రావాల్సిందిగా కోరారు..ఈ మేరకు పెళ్లి కార్డు ను రేవంత్ కు అందజేశారు. రీసెంట్ గా షర్మిల కాంగ్రెస్ పార్టీ లో చేరిన సంగతి తెలిసిందే. అలాగే తన YSRTP పార్టీ ని కాంగ్రెస్ లో విలీనం చేయడం జరిగింది. ప్రస్తుతం కుమారుడి పెళ్లి పనుల్లో షర్మిల బిజీ బిజీ గా ఉన్నారు. ఈ నెల 18వ తేదీన వైఎస్ రాజా రెడ్డి- ప్రియా అట్లూరి నిశ్చితార్థం జరగనుండగా…ఫిబ్రవరి 17వ తేదీన వివాహం జరగనుంది.
We’re now on WhatsApp. Click to Join.
ఈ క్రమంలో వరుసగా రాజకీయ నేతలను కలుస్తూ షర్మిల పెళ్లికి రావాల్సిందిగా కోరుతుంది. రెండు రోజుల క్రితం విజయవాడ కు వెళ్లి తన అన్న సీఎం జగన్ (CM Jagan) ను కలసి మేనల్లుడి వివాహానికి రావాల్సిందిగా కోరడం జరిగింది. దాదాపు రెండేళ్ల తర్వాత జగన్ ను కలవడం విశేషం. ఇక మరో రెండు రోజుల్లో టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) ను షర్మిల కలవబోతున్నట్లు తెలుస్తుంది. కుమారుడి వివాహ శుభలేఖను అందించి ఆహ్వానం పలకానుందని సమాచారం. రీసెంట్ గా క్రిస్మస్ సందర్బంగా చంద్రబాబు ఫ్యామిలీ కి క్రిస్మస్ గిఫ్ట్ ను షర్మిల పంపించిన సంగతి తెలిసిందే.
Read Also : ISRO Aditya-L1: ఇస్రో విజయంపై హర్షం వ్యక్తం చేసిన ప్రధాని మోదీ