Site icon HashtagU Telugu

Telangana Politics: దొంగలే భుజాలు తడుముకున్నట్లు ఉంది: వైఎస్ షర్మిల

Telangana Politics

New Web Story Copy 2023 06 07t163922.448

Telangana Politics: తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుపై వైఎస్ఆర్టీపి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు ఆమె ట్విట్టర్ వేదికగా సీఎం కెసిఆర్ పై సంచలన కామెంట్స్ చేశారు. దొంగలే భుజాలు తడుముకున్నట్లు ఉంది అంటూ సీఎం కేసీఆర్ ను ఉద్దేశించి ఆమె ఈ తరహా వ్యాఖ్యలకు పాల్పడ్డారు. వైఎస్ షర్మిల ట్విట్టర్లో ఈ విధంగా స్పందించారు.

‘దళారి దొంగలు, కొత్త వేషగాళ్లు, దోపిడీదారులు’ అంటూ దొర మాట్లాడుతుంటే..దొంగలే భుజాలు తడుముకున్నట్లు ఉంది అంటూ కేసీఆర్ పై మండిపడ్డారు షర్మిల. కెసిఆర్ అండ్ కో కన్నా ఈ దేశంలో దళారి ఎవరని ఆమె ప్రశ్నించారు. తెలంగాణను సర్వం దోచుకున్న దోపిడీదారులు ఎవరంటూ ఫైర్ అయ్యారు. 3 కోట్ల మంది తెలంగాణ బిడ్డల ఉద్యమ ఆకాంక్షను నమ్మి చేతుల్లో పెడితే నట్టేట ముంచిన దోపిడీ దొంగలు మీరు కాదా అంటూ కెసిఆర్ ప్రభుత్వాన్ని ఎండగట్టారు షర్మిల. నీళ్లు అని చెప్పి ఫామ్ హౌజ్ కి, నిధులని చెప్పి మీ ఖజానాకు,ఉద్యోగాలు అని చెప్పి మీ కుటుంబానికి ఎత్తుకుపోయిన మోసగాళ్లు మీరే అంటూ వ్యాఖ్యానించారు.

బంగారు తునక రాష్ట్రాన్ని 5 లక్షల కోట్ల అప్పుల కుప్ప చేసి ఆ సొమ్ముతో దేశ రాజకీయాలు చేసే మీరే ఈ శతాబ్దపు అసలైన దళారులు. బడి నుంచి సాగుబడి వరకు అన్ని ప్రాజెక్టులపై లక్ష కోట్ల కమీషన్లు తిన్న దోపిడీ దారులు మీరే. పార్టీ కార్యాలయాలకు,అయినోల్లకు అగ్గువకే 30 వేల ఎకరాల ప్రభుత్వ స్థలాలు కట్టబెట్టిన మీ పాలన దళారి పాలన అని ఆరోపించారు. దొర గుడిని మింగితే ఆయన ఎమ్మెల్యేలు లింగాలనే మింగే దళారులు అంటూ ఓ రేంజ్ లో మండిపడ్డారు షర్మిల. కట్టిన అతికొద్ది డబుల్ బెడ్ రూం ఇండ్లలో 5 లక్షలు, దళితబంధులో 3 లక్షలు, ఇండ్ల స్థలాల క్రమబద్దీకరణకు 3 లక్షలు,కాంట్రాక్టర్ల బిల్లుల్లో 30% కమీషన్లు,ఇసుక,మట్టి, మాఫియాతో వేల కోట్లు దోచుకు తింటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అతి పెద్ద దళారులుగా ఆమె అభివర్ణించారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా తప్పించుకుని తిరుగుతూ… ఎన్నికల సమయంలోనే ప్రజలకు కనిపించి, పూటకో మాట,గడికో హామీ.. అంటూ మస్త్ మాటలు చెప్పే అసలైన పగటి వేషగాడు కేసీఆర్ అంటూ సంచలన ఆరోపణలు చేశారు షర్మిల.

గంజి కేంద్రాలు ఏమో కానీ మీ నియంత పాలనలో గల్లికొక లిక్కర్ కేంద్రాలే మిగిలినయ్.రైతు రాజ్యం ఉందని..దొరల రాజ్యం నడుపుతూ,వెలుగుజిలుగులు వచ్చాయని..అంధకారంలోకి నెట్టిన మీ దళారి పాలనను బొంద పెట్టే గడియలు దగ్గరపడ్డాయి అంటూ ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా అవాకులు చవాకులు పేల్చారు షర్మిల.

Read More: KCR strategy : ఆంధ్రాను గేలిచేస్తోన్న కేసీఆర్! నోరెత్తని ఏపీ పాల‌కులు!!