Site icon HashtagU Telugu

YS Sharmila: ఓట్ల పండగ రాగానే పోడు రైతులు యాదికొచ్చారా?

Sharmila Kcr

Sharmila Kcr

YS Sharmila: రాజకీయంగా నిత్యం అధికార పార్టీని ప్రశ్నించే వైఎస్ఆర్టీపి చీఫ్ వైఎస్ షర్మిల తాజాగా సీఎం కేసీఆర్ పోడు భూముల పట్టాల పంపిణీపై విమర్శలు గుప్పించారు. నిన్న సీఎం కేసీఆర్ అసిఫాబాద్లో పర్యటించారు. గిరిజనులకు పోడు భూముల పత్రాలను పంపిణీ చేశారు. ఈ క్రమంలో కేసీఆర్ గిరిజనులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ క్రమంలో వైఎస్ షర్మిల నిన్న జరిగిన కార్యక్రమంపై విమర్శలు చేశారు.

ఇన్నాళ్లు పోడు రైతులను కొట్టి,హింసించి, జైలులో వేసిన దొర గారికి ఓట్ల పండగ దగ్గరకు రాగానే మళ్లీ పోడు రైతులు యాదికొచ్చారా అంటూ మండిపడ్డారు. తొమ్మిదేండ్లలో ఎనిమిది సార్లు పోడు పట్టాలు ఇస్తానని ప్రకటించి పోడు రైతుల్ని నిండా ముంచిన సీఎం ఇప్పుడు ఓట్ల సమయం కావడంతో గిరిజనులపై సవతి తల్లి ప్రేమ కురిపిస్తున్నాడని ఫైర్ అయ్యారు ఆమె. ఊరించి ఊరించి కొసరేసినట్టు కొంతమందికే పట్టాలు ఇచ్చి చేతులు దులుపుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడని షర్మిల ఆరోపించారు.

రాష్ట్ర వ్యాప్తంగా 12.50 లక్షల ఎకరాల్లో పోడు భూములు ఉన్నాయని స్వయంగా అధికారులే లెక్కలు బయటపెడితే.. ఆ కాగితాలను చింపేసి కాదు 4.05 లక్షల ఎకరాలే పోడు పట్టాలు అని సొంత లెక్కలు చెప్తున్నారని అధికార పార్టీని ఎండగట్టారు ఆమె. 25శాతం భూములకు మాత్రమే పోడు పట్టాలు ఇచ్చి, మిగిలిన రైతులకు ఎగనామం పెట్టడమే దొర గారి దురాలోచన అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు షర్మిల. పోడు రైతుల పట్ల కేసీఆర్ కు చిత్తశుద్ధే ఉంటే.. నాలుక మీద నరమే ఉంటే ఇచ్చిన హామీ ప్రకారం.. 12.50లక్షల ఎకరాలకు పోడు పట్టాలు ఇవ్వాలి.

Read More: Modi- Amit shah: యాక్ష‌న్‌లోకి అమిత్ షా, న‌డ్డా.. ఆరోజే ఫుల్ క్లారిటీ వ‌చ్చేస్తోందా?