Telangana: జర్నలిస్టులను కాటేసిన కాలనాగు కేసీఆర్: షర్మిల

తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేక వార్తలు రాసే మీడియా సంస్థలపై ఆగ్రహం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్. బీఆర్ఎస్ ప్రభుత్వం దేశంలోనే మంచి గుర్తింపును సొంతం చేసుకుందని

Telangana: తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేక వార్తలు రాసే మీడియా సంస్థలపై ఆగ్రహం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్. బీఆర్ఎస్ ప్రభుత్వం దేశంలోనే మంచి గుర్తింపును సొంతం చేసుకుందని, అలాంటి ప్రభుత్వంపై వ్యతిరేక వార్తలు రాసే జర్నలిస్టులకు ప్రభుత్వ ఇళ్లు ఇవ్వబోమని చెప్పారు కేసీఆర్. కేసీఆర్ స్టేట్మెంట్ పై జర్నలిస్టులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జర్నలిస్టుల కోసం కేటాయించే ఇళ్లలో వారికీ మాత్రమే ఇస్తాం, వీళ్ళకి ఇవ్వమని అనడమేంటని మండిపడుతున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాయడం తప్పా అంటూ ప్రశ్నిస్తున్నారు. జర్నలిస్టులకు అండగా వైఎస్ఆర్టీపి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సీఎం కేసీఆర్ ప్రకటనపై మండి పడ్డారు.

తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపిన జర్నలిస్టులను కేసీఆర్ అవమానిస్తున్నారని ఆరోపించారు. బంది పోట్ల రాష్ట్ర సమితి దోపిడీ పై నిజానిజాలు బయటపెడితే విషం చిమ్మినట్లా దొరా అంటూ విమర్శించారు. జర్నలిస్టులు జీవితాలు త్యాగం చేయకపోతే రాష్ట్రం వచ్చేదా? ఈ నియంతకు అధికారం దక్కేదా అన్నారు. విషం చిమ్మే పత్రికల జర్నలిస్టులకు ఇండ్లు ఇవ్వం అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటనని ఆమె ఖండించారు. తక్షణమే కేసీఆర్ జర్నలిస్టు మిత్రులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

పదవులు కుటుంబానికి పంచుకున్నట్లు.. పథకాలు పార్టీ కార్యకర్తలకు ఇచ్చుకున్నట్లు… జర్నలిస్టుల ఇండ్లు,స్థలాలు దొరకు భజన చేసేటోళ్లకే ఇద్దాం అనుకుంటుండు అంటూ ఎద్దేవా చేసింది షర్మిల.. మీకు నచ్చినోళ్లకు ఇచ్చుకోవడానికి రాష్ట్రం మీ అబ్బ సొత్తేం కాదు. భజన చేస్తే ఇస్తాం అనడానికి మీరు శాశ్వతం కాదు. ఆనాడు ప్రత్యేక రాష్ట్రం కోసం జర్నలిస్టులు చేసిన పోరాటాన్ని మరిచి దొర అధికార మదంతో నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నడు.ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి పూటకో మాట చెప్పే గుంట నక్క కేసీఆర్.అవసరం తీరాక జర్నలిస్టులను కాటేసిన కాలనాగు కేసీఆర్ అంటూ షర్మిల ధ్వజమెత్తారు.

Also Read: Chandrayaan-3 : చంద్రయాన్‌ -3 తో భారత్ చరిత్ర సృష్టించబోతోంది