Site icon HashtagU Telugu

Telangana: నిరుద్యోగులే ప్రగతిభవన్ గడీలను బద్దలు కొడతారు

Ys Sharmila

Ys Sharmila

Telangana: రోజుకొక అంశంపై ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న వైఎస్ఆర్టీపి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఈ రోజు నిరుద్యోగులపై స్పందించారు. గ్రూప్–2 పరీక్ష వాయిదాకు 5 లక్షల మంది అభ్యర్థులు పట్టుబడుతున్నా.. దొరకు నిద్ర మత్తు వదలడం లేదని విమర్శించారు. నిరుద్యోగులు రోడ్లపై ధర్నాలు చేస్తున్నా కంటికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. పరీక్షలు మరో 3 నెలలు వాయిదా వేయాలని ఎవరెంత మొత్తుకున్నా పట్టింపు లేనితనం కేసీఆర్ నియంత పోకడకు మరోసారి అద్దం పడుతుందని ధ్వజమెత్తారు షర్మిల. తొమ్మిదేండ్లుగా ఉద్యోగాల భర్తీ పక్కన పెట్టి నిరుద్యోగులను ఉరికంభం ఎక్కించారు.ఇంటికో కొలువు ఇస్తనంటే నమ్మినందుకు తల్లిదండ్రులకు పుట్టెడు శోకాన్ని మిగిల్చారని సీఎం కేసీఆర్ పై ఫైర్ అయ్యారు ఆమె.

కొలువులు ఇయ్యండని రోడ్డు మీదికి వచ్చిన లక్షలాది మందిపై లాఠీలు ఝులిపించారు. ప్రశ్నించిన నిరుద్యోగులపై అక్రమ కేసులు బనాయించారు. అంగట్లో ప్రశ్నాపత్రాలు అమ్ముకొని నిరుద్యోగుల కడుపుల్లో మట్టి కొట్టారు. టీఎస్పీఎస్సీ బోర్డును భ్రష్టు పట్టించింది చాలదన్నట్లు ఎన్నికల్లో లబ్ది పొందడం కోసం హడావిడిగా బలవంతపు పరీక్షలు పెడుతున్నారు. నిరుద్యోగుల ఆశయాలను శాశ్వతంగా సమాధి చేస్తున్నారు. ఇకనైనా మీ దుర్మార్గపు ఆలోచన మానుకొని, నిరుద్యోగులు కోరుతున్నట్లు గ్రూప్–2 పరీక్షలను వాయిదా వేయాలి. నిరుద్యోగులతో చర్చించి క్రమపద్ధతి ప్రకారం పరీక్షలు నిర్వహించాలి. లేదంటే మీ బంధిపోట్ల రాష్ట్ర సమితిని నిరుద్యోగులే బొంద పెడతారు. ప్రగతిభవన్ గడీలను బద్దలు కొట్టి రోడ్డుపైకి ఈడుస్తారని సంచలన కామెంట్స్ చేశారు వైఎస్ షర్మిల.

Also Read: AP : అప్పుడే టీడీపీ – జనసేన కలిసిపోయాయి..

Exit mobile version