Telangana: తెలంగాణ సీఎం కేసీఆర్ ని లక్ష్యంగా చేసుకుని వైఎస్ షర్మిల రోజుకో అంశంపై పోరాటం చేస్తున్నారు. తెలంగాణాలో వైఎస్ఆర్టీపి పార్టీని నెలకొల్పిన వైఎస్ షర్మిల తెలంగాణ ప్రభుత్వ తప్పిదాలను ఎండగడుతున్నారు. తన పొలిటికల్ కెరీర్ ఏమో కానీ ప్రజా సమస్యలపై పోరాడటంలో షర్మిల విజయం సాధించారు. తాజాగా వైఎస్ షర్మిల దళితబంధుపై ప్రభుత్వాన్ని నిలదీశారు. ఈ మేరకు ఆమె నిరాహారదీక్ష చేశారు. ఈ మేరకు షర్మిల మాట్లాడుతూ.. కేసీఆర్ ఇప్పటికైనా మేల్కోవాలి.. పేదల కన్నీళ్లు చూసైనా పథకాలు సక్రమంగా అమలు చేయాలని సూచించారు. దళిత బంధుపై సమీక్ష చేసి ఎమ్మెల్యేల దోపిడీని అరికట్టాలని ఆమె డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు ఇచ్చిన దళిత బంధులో జరిగిన అవినీతి ఎంతో తేల్చి, ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రజలకు హామీ ఇచ్చిన విధంగా ఎలాంటి అవినీతికి చోటు లేకుండా పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేసి పథకాన్ని అమలు చేయాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. నిరాహారదీక్షలో కూర్చున్న షర్మిలను పరామర్శించడానికి ప్రజలు తండోపదండలుగా వచ్చారు. ఈ సందర్భంగా వైఎస్ షర్మిల ప్రతిఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. గజ్వేల్ తీగుల్ గ్రామ ప్రజలు షర్మిలను పరామర్శించారు.
Also Read: Himachal Pradesh: హిమాచల్ వరదలపై మోడీ ఉన్నత స్థాయి సమీక్ష