YS Sharmila: వైఎస్ఆర్ ఇచ్చిన ఇళ్ల స్థలాలను కేసీఆర్ కాజేసిండు

తెలంగాణ ప్రభుత్వంపై వైఎస్ఆర్టీపి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. తెలంగాణ జర్నలిస్టులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోగా

YS Sharmila: తెలంగాణ ప్రభుత్వంపై వైఎస్ఆర్టీపి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. తెలంగాణ జర్నలిస్టులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోగా వైఎస్ఆర్ జర్నలిస్టులకు ఇచ్చిన భూములను సీఎం కేసీఆర్ కాజేశారంటూ సంచలన ఆరోపణలకు దిగారు. ఈ మేరకు తెలంగాణ జర్నలిస్టులకు ఇచ్చిన హామీలను నిరవేర్చాలంటూ ఆమె డిమాండ్ చేశారు.

తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ వద్ద తెలంగాణ జర్నలిస్టుల మహా ధర్న కార్యక్రమంలో వైఎస్ఆర్టీపి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాల్గొన్నారు. ఈ సందర్భంగా జర్నలిస్టుల మహా ధర్నాకు ఆమె మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ షర్మిల సీఎం కెసిఆర్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తెలంగాణ జర్నలిస్టులకు వైఎస్ రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో ఇళ్ల పట్టాలు ఇచ్చారని, అయితే ఆ స్థలాలను కేసిఆర్ సీఎం అయ్యాక కాజేశారని ఆరోపించారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తే కమీషన్లు రావని, వ్యాపారవేత్తలకు, కబ్జాదారులకు ఆ స్థలాలను కట్టబెడితే కమీషన్లు వస్తాయని సీఎం కెసిఆర్ భావిస్తున్నారని ఆమె మండిపడ్డారు.

పోశమ్మ పోగు చేస్తే మైసమ్మ కాజేసినట్టు , వైఎస్ఆర్ 70 ఎకరాల స్థలాన్ని జర్నలిస్టులకు కేటాయిస్తే కెసిఆర్ ఆ స్థలాలను కాజేసినట్టు షర్మిల దుయ్యబట్టారు. వచ్చే ఎన్నికల నాటికి జర్నలిస్టుల ఇళ్ల స్థలాల అంశాన్ని వైఎస్ఆర్టీపి పార్టీ మానిఫెస్టోలో పెడతామని ఆమె చెప్పారు. కాగా.. తెలంగాణాలో జర్నలిస్టులపై దాడులు జరుగుతున్నాయని ఆమె అన్నారు. వాస్తవాలను రాసే జర్నలిస్టులపై అధికార పార్టీ దాడులు జరుపుతున్నట్టు షర్మిల ఆరోపించారు.

Read More: Jagan Delhi : ఢిల్లీ అపాయిట్మెంట్ నో, తాడేప‌ల్లి వైపు సీబీఐ?