Telangana : YSRTP విలీనంపై వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు

ఈ నెల 30లోపు విలీనంపై నిర్ణయం తీసుకుంటామని.. లేకుంటే రాబోయే ఎన్నికల్లో సొంతంగా బరిలోకి దిగుతామని షర్మిల సంచలన ప్రకటన చేశారు

Published By: HashtagU Telugu Desk
YS Sharmila About YSRTP Merge in Congress

YS Sharmila About YSRTP Merge in Congress

YSRTP ని కాంగ్రెస్‌‌ పార్టీలో విలీనం ( YSRTP Merge in Congress) చేయడం ఫై పార్టీ అధినేత్రి వైస్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేసారు. సోమవారం పార్టీ రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశంలో షర్మిల (YS Sharmila) మాట్లాడుతూ.. ఈ నెల 30లోపు విలీనంపై నిర్ణయం తీసుకుంటామని.. లేకుంటే రాబోయే ఎన్నికల్లో సొంతంగా బరిలోకి దిగుతామని షర్మిల సంచలన ప్రకటన చేశారు.

రాజన్న పాలనా ను తెలంగాణ లో తీసుకరావాలని షర్మిల గట్టిగానే ట్రై చేసేంది కానీ కాంగ్రెస్ , బిఆర్ఎస్ , బిజెపి మధ్య షర్మిల ను ప్రజలు పెద్దగా పట్టించుకోలేదు. సీఎం కేసీఆర్ ఫై గట్టిగానే ఫైట్ చేసినప్పటికీ పెద్దగా ఉపయోగపడే లేదు. ఇదే క్రమంలో రాష్ట్రంలో కాంగ్రెస్ హావ రోజు రోజుకు పెరుగుతుండడం తో YSRTP ని కాంగ్రెస్ లో కలపాలని ఫిక్స్ అయ్యింది. సోనియా , రాహుల్ లతో చర్చలు మొదలుపెట్టారు. పార్టీ విలీనం ఫై కాంగ్రెస్ అధిష్టానం ఓకే అనేసింది..కాకపోతే షర్మిల కండిషన్లకు నో చెప్పింది. దీంతో విలీన కార్యక్రమం ఆలా హోల్డ్ పడింది.

Read Also : AP : చంద్రబాబును ఆ స్థితిలో చూసి కన్నీరు పెట్టుకున్న భువనేశ్వరి

షర్మిలను ఏపీ రాజకీయాల్లో ఉపయోగించుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. కానీ ఏపీకి వెళ్లేందుకు షర్మిల ఆసక్తి చూపించడం లేదు. తెలంగాణలోనే రాజకీయాలు చేయాలని ఆమె గట్టిగా భావిస్తోంది. అలాగే పాలేరు నుంచి పోటీ చేస్తానని ఇప్పటికే ప్రకటించిన షర్మిల.. అక్కడ పార్టీ కార్యాలయం కూడా ఏర్పాటు చేసుకుంది. కానీ మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్‌లో చేరడంతో.. ఆయనకే పాలేరు టికెట్ ఇచ్చేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది. కాకపోతే షర్మిలకు కాంగ్రెస్ కర్ణాటక నుంచి రాజ్యసభ ఆఫర్ చేసినట్లు తెలుస్తుంది. మరి రాజ్యసభ ఆఫర్ ను ప్రస్తుతం షర్మిల ఆలోచిస్తుంది. అందుకే విలీనం విషయంలో కాస్త ఆలోచన చేస్తుంది.

ఒకవేళ విలీనం లేకపోతే వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగాలని షర్మిల చూస్తుంది.. తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లో సింగిల్‌గా పోటీ చేసేందుకు YSRTP సిద్దంగా ఉందని పార్టీ శ్రేణులు చెపుతున్నారు. మరి ఈ నెల 30 తర్వాత ఏంజరుగుతుందో చూడాలి.

  Last Updated: 25 Sep 2023, 08:51 PM IST