బెట్టింగ్ యాప్(Betting App )లను ప్రమోట్ (Promote) చేసి మోసపూరితంగా ప్రజలను ప్రలోభాలకు గురిచేసిన కేసు లో పలువురు యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లు నేడు పోలీసుల ఎదుట హాజరుకానున్నారు. మొత్తం 17 మందిపై కేసు నమోదు చేయగా, వీరిలో కొందరికి ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. ప్రముఖ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లు నటి శ్యామల, రీతూ చౌదరి, అజయ్, సుప్రీత, సన్నీ సుధీర్, అజయ్ సన్నీ లను విచారణకు పిలిచినట్లు సమాచారం.
Guntur Air Taxi : మేడిన్ గుంటూరు ‘ఎయిర్ ట్యాక్సీ’.. యువతేజం చావా అభిరాం కసరత్తు
ఈ బెట్టింగ్ యాప్‌ల ప్రచారంతో అమాయక ప్రజలు భారీగా మోసపోతున్నారనే ఆరోపణలతో సీనియర్ పోలీస్ అధికారి సజ్జనార్ ఫిర్యాదు చేశారు. వీరి ప్రమోషన్ల కారణంగా యువత పెద్ద ఎత్తున డబ్బులు కోల్పోయారని, గందరగోళానికి గురవుతున్నారని అధికారుల వాదన. ఇప్పటికే కాగా వీరి బ్యాంకు లావాదేవీలు, ప్రోత్సాహక మొత్తాలపై దర్యాప్తు జరుపుతున్న పోలీసులు, విచారణలో మరింత సమాచారం రాబట్టే అవకాశముంది.
ఈ కేసు సోషల్ మీడియాలో వివాదాస్పదంగా మారింది. ప్రజలకు తప్పుడు సమాచారం అందించడం, చట్టవిరుద్ధమైన కార్యకలాపాలను ప్రోత్సహించడం వంటి అభియోగాలు వీరిపై నమోదు అయ్యాయి. విచారణ అనంతరం పోలీసులు మరిన్ని కఠిన చర్యలు తీసుకునే అవకాశముందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ పరిణామాలు యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లు భవిష్యత్తులో ఏ విధంగా ప్రచారాలు నిర్వహించాలనే విషయంపై కొత్త చర్చకు దారితీసాయి.