తెలంగాణ ప్రజలకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఏడాదిలో సరికొత్త ఆలోచనలు, ఆశయాలు, లక్ష్యాలతో ముందుకు సాగాలని, అందరికీ మంచి జరగాలని నూతన సంవత్సరం సందర్భంగా ఆకాంక్షించారు. గతాన్ని సమీక్షించుకుని బంగారు భవిష్యత్తు నిర్మాణం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు.
నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరి ఇంటా సంతోషాలు వెల్లి విరియాలని, ప్రతి ఒక్కరూ ఆనందకరమైన జీవితం గడపాలని కోరుకుంటున్నానన్నారు. ముఖ్యంగా విద్యార్థులు, యువత నూతన లక్ష్యాలు నిర్దేశించుకుని, వాటిని సాధించేలా ప్రణాళికతో ముందుకు సాగాలని హరీష్ రావు గారు కోరారు. నిర్దేశించుకున్న లక్ష్యాలను వచ్చే ఏడాది నాటికి చేరుకునేలా శ్రమించాలని కోరారు.
2023వ సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ, 2024లోకి అడుగుపెడుతున్న వేళ అందరికీ శుభం కలగాలని కోరుకుంటూ “హ్యాపీ న్యూ ఇయర్” చెప్పారు. అలాగే బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలకు ఆయన గ్రీటింగ్స్ చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేయాలని హరీశ్ రావు ఈ సందర్భంగా అన్నారు.
Also Read: TDP: 2024 ఎన్నికల్లో టీడీపీ-జనసేన అధికారంలోకి వస్తుంది: టీడీపీ నేత నారాయణ