Site icon HashtagU Telugu

Drugs: హైదరాబాద్ లో ‘డ్రగ్స్’ కలకలం.. బిటెక్ స్టూడెంట్ బలి!

Drugs Kerala

Drugs Kerala

డ్రగ్స్ నివారణకు సంబంధిత అధికారులు, ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. చాపకింద నీరులా విస్తరిస్తూనే ఉంది. ఫలితంగా బిటెక్ యువకులు డ్రగ్స్ కు అలవాటు పడి విలువైన జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. హైదరాబాద్ లో తాజాగా 23 ఏళ్ల ఇంజనీరింగ్ స్టూడెంట్ డ్రగ్ ఓవర్ డోస్ కారణంగా మరణించాడు. ఈ మేరకు మృతుడి స్నేహితుడిని అరెస్టు చేసినట్లు ప్రకటిస్తూ గురువారం అదనపు పోలీసు కమిషనర్ (లా అండ్ ఆర్డర్) డీఎస్ చౌహాన్ ఈ విషయాన్ని వెల్లడించారు. రాకేష్ (పేరు మార్చబడింది). చికిత్స నిమిత్తం నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో చేరిన దాదాపు రెండు వారాల తర్వాత మరణించాడు. అయితే మోతాదుకు మించి డ్రగ్స్ తీసుకోవడంతోనే రాకేష్ చనిపోయినట్టు సమాచారం. రాకేష్ ఇటీవల స్నేహితులతో తన పర్యటనలో గోవా నుండి సేకరించిన LSD, కొకైన్, MDMA గంజాయి కాక్టెయిల్‌ను తరచుగా తీసుకునేవాడు. కొన్నాళ్లుగా డ్రగ్స్ అలవాటు పడి తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. డ్రగ్స్ వాడకం పెరిగిపోవడంతో చికిత్స పొందుతూ చనిపోయాడు. అతని స్నేహితుడు, శివం రోడ్‌లోని డిడి కాలనీకి చెందిన రియల్టర్ ప్రేమ్ ఉపాధ్యాయ (27), ముగ్గురు కూడా డ్రగ్స్ కు అలవాటు పడ్డారు.

కొండాపూర్‌కు చెందిన టెక్కీ రామకృష్ణ (27), గిటార్‌ టీచర్‌ నార్సింగికి చెందిన నిఖిల్‌ జాషువా (27), తార్నాకకు చెందిన ఇంజినీరింగ్‌ విద్యార్థి జీవన్‌రెడ్డి (26) బిటెక్ స్టూడెంట్స్ కూడా డ్రగ్స్ తీసుకునేవాళ్లు. ప్రేమ్ ఉపాధ్యాయ డ్రగ్స్ తీసుకోవడం ప్రారంభించాడని, తర్వాత లక్ష్మీపతి అనే వ్యక్తి నుంచి నిషిద్ధ వస్తువులను విక్రయించడం ప్రారంభించాడు. హైదరాబాద్ లో అవసరమైన కస్టమర్‌లకు ఒక్కొక్కరికి ₹3,000 చొప్పున విక్రయిస్తున్నారు. పక్కా సమాచారం అందుకున్న యాంటీ నార్కోటిక్స్ బృందం నల్లకుంటలోని కూరగాయల మార్కెట్‌ దగ్గర నిఘా వేసి పట్టుకున్నారు. బాధితుల నుంచి ఆరు ఎల్‌ఎస్‌డి బ్లాట్‌లు, 10 ఎక్స్ టసీ మాత్రలు, 100 గ్రాముల హ్యాష్ ఆయిల్, నాలుగు మొబైల్ ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ ₹1.2 లక్షలు. కాగా డ్రగ్స్ అలవాటు పడిన మరికొంతమంది విద్యార్థులు కూడా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు సమాచారం.