తెలంగాణ రాజకీయాలు మళ్లీ కాకరేపుతున్నాయి. తాజాగా మంగళవారం నాంపల్లి బీజేపీ కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తల (Youth Congress attacked the BJP office) దాడి చేసారు. ఈ దాడి పై బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ (MLA Rajasingh) తీవ్రంగా స్పందించారు. దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేసిన ఆయన, తాము తలుచుకుంటే కాంగ్రెస్ ఆఫీస్ తగలబెడతామని హెచ్చరించారు. ఈ దాడికి సీఎం రేవంత్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
Nampally : బీజేపీ ఆఫీసు వద్ద ఉద్రిక్తత..కాంగ్రెస్, బీజేపీ శ్రేణుల మధ్య ఘర్షణ
ఈ సంఘటనకు కారణం బీజేపీ మాజీ ఎంపీ రమేష్ బిదురి (Ramesh Bidhuri) చేసిన వ్యాఖ్యలు. ఢిల్లీకి చెందిన బీజేపీ నేత రమేష్ బిదురి ఇటీవల కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ(Priyanka Gandhi)పై సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తే ఢిల్లీలో రోడ్లను ప్రియాంక గాంధీ బుగ్గలలా తయారుచేస్తామన్నారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ బిజెపి నేతల తీరు పై నిరసనలు చేస్తున్నారు. మంగళవారం నాంపల్లి లోని బిజెపి కార్యాలయంపై కాంగ్రెస్ శ్రేణులు దాడికి దిగారు. ఈ క్రమంలో రెండు పార్టీల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్ కార్యకర్తలు కోడిగుడ్లు, రాళ్లతో బీజేపీ కార్యాలయంపై దాడి చేశారు. బీజేపీ కార్యకర్తలు వారిని అడ్డుకునే ప్రయత్నం చేయడంతో పలువురు కార్యకర్తలకు గాయాలు అయ్యాయి. దీనితో వారిని ఆసుపత్రికి తరలించారు. మరోపక్క రాజా సింగ్ చేసిన వ్యాఖ్యలు మరింత వేడెక్కిస్తున్నాయి.