Kingfisher Beer Light : లైట్ బీర్లు అందజేయాలంటూ తెలంగాణ సర్కార్ కు లేఖ ..

  • Written By:
  • Publish Date - April 29, 2024 / 09:44 PM IST

తెలంగాణ (Telangana ) లో ఎండలు (Summer ) ఏ రేంజ్ లో దంచి కొడుతున్నాయో తెలియంది కాదు..ఉదయం 9 దాటితే నిప్పుల కొలిమిలా మారుతుంది. ఇంట్లో నుండి అడుగు భయటపెట్టాలనే ప్రజలు వణికిపోతున్నారు. సాయంత్రం 07 వరకు కూడా వేడి ఏమాత్రం తగ్గకపోయేసరికి ప్రజలంతా కూలర్లు , ఫ్యాన్లు , ఏసీలకు అత్తుకుపోతున్నారు. ఇక ఈ వేడి తాపాన్ని తట్టుకోలేక మందుబాబులు బీర్లను తెగతాగేస్తూ ఉండడం తో రాష్ట్ర వ్యాప్తంగా బీర్ల కొరత ఏర్పడింది. సరఫరా కు మించి బీర్ల అమ్మకాలు జరుగుతుండడం తో లిక్కర్ సంస్థలు డిమాండ్ కు తగ్గట్లు ఇవ్వలేకపోతుంది. దీంతో గత పది రోజులుగా రాష్ట్రంలోని అన్ని వైన్స్ లలో బీర్ల కొరత ఏర్పడింది. దీంతో మాకు బీర్లు అందజెయ్యండి మహాప్రభో అంటూ ఏకంగా తెలంగాణ సర్కార్ కు లేఖలు రాస్తున్నారు. తాజాగా తాగుబోతుల సంఘం నాయకుడు మాకు లైట్ బీర్లు అందజేయాలంటూ ఎక్సెజ్ ఆఫీసర్ కు లేఖ అందించిన ఘటన మంచిర్యాల లో చోటుచేసుకుంది.

We’re now on WhatsApp. Click to Join.

మందుబాబుల దాహార్తి తీర్చే లైట్ బీర్లు దొరకడం లేదని.. జిల్లాలోని వైన్స్, బార్ అండ్ రెస్టారెంట్లలో కింగ్ ఫిషర్ బీర్లు దొరకడం లేదని కుట్రంగి తరుణ్ అనే యువకుడు జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తా నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు పాదయాత్రగా వెళ్లి ఎక్సైజ్ అధికారికి వినతి పత్రం అందజేశారు. ఆ బీర్లు అందుబాటులో లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తాగుబోతుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడైన తరుణ్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఫిర్యాదును స్వీకరించిన అధికారి..తప్పకుండ బీరు అందేలా చూసుకుంటామని హామీ ఇచ్చారు.

ఇదిలా ఉంటె తాజాగా ఎక్సెజ్ అధికారులు ఏప్రిల్ 1 నుంచి 18 వరకు రాష్ట్ర వ్యాప్తంగా మందుబాబులు రూ.670 కోట్ల విలువైన 23 లక్షల కేసుల బీర్లను (Beer ) తాగినట్లు నివేదకలో తెలిపారు. ఇది ఆల్టైమ్ రికార్డు అని ఎక్సైజ్ అధికారులు చెపుతున్నారు. గతేడాది ఇదే నెల కంటే 28.7% అధికంగా బీర్ల అమ్మకాలు జరిగాయని చెప్పుకొచ్చారు. కాగా గత 15 రోజులుగా బీర్ల తయారీ తగ్గడంతో అమ్మకాలు ఇంకాస్త తగ్గాయని లేదంటే ఇంకా పెరిగి ఉండేదని అంటున్నారు. వర్ష ప్రభావం లేకపోవడంతో బీర్ల కొరత ఏర్పడిందని..డిమాండ్ తగ్గ బీర్లను అందించలేకపోతున్నామని చెపుతున్నారు. ఈ నెలలోనే ఇలా ఉంటె…వచ్చే నెలలో బీర్ల అమ్మకాలు ఇంకాస్త ఎక్కువగా ఉంటాయని లెక్కలు వేస్తున్నారు. మామూలుగానే తెలంగాణ లో లిక్కర్ అమ్మకాలు ఎక్కువగా ఉంటాయి..ఇంకా ఎండాకాలం అయితే మరింతగా ఉంటాయి..కాకపోతే ఈసారి ఎండల తీవ్రత ఎక్కువగా ఉండడంతో బీర్ల కు ఫుల్ డిమాండ్ ఏర్పడుతుంది.

Read Also : OU University : ఓయూ విద్యార్థులకు భరోసా ఇచ్చిన భట్టి