Site icon HashtagU Telugu

Rape : హైదరాబాద్లో యువతిపై ఆటో డ్రైవర్ అత్యాచారం

Minor Girl

Minor Girl

హైదరాబాద్లో (Hyderabad) యువతిపై ఆటో డ్రైవర్ అత్యాచారం (young woman was raped) చేసిన ఘటన కలకలం రేపుతోంది. బాధితురాలు ఫిర్యాదు మేరకు, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దేశ వ్యాప్తంగా మహిళలకే కాదు.. అభంశుభం తెలియని చిన్నారులకు సైతం రక్షణ అనేది కరువైంది. అర్ధరాత్రి పూట ఒంటరిగా మహిళ వచ్చినప్పుడే మనకు స్వాతంత్రం వచ్చినట్టు అని మహానుభావులు అన్నారు. కానీ అది ఎప్పటికి జరగదని ప్రస్తుతం జరుగుతున్న ఘటనలు చూస్తే అర్ధం అవుతుంది. అర్ధరాత్రి కాదు పట్టపగలే ఒంటరిగా మహిళ (Woman) నడవలేని పరిస్థితి ప్రస్తుతం కొనసాగుతుంది. రోడ్ మీదే కాదు ఇంట్లో కూడా ఉండలేని స్థితికి కామాంధులు తీసుకొచ్చారు. ఒంటరి మహిళా కనిపిస్తే చాలు వయసు తో సంబంధం లేకుండా లైంగిక దాడికి పాల్పడుతున్నారు. ప్రతి రోజు పదుల సంఖ్యలో దాడులు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి.

తాజాగా హైదరాబాద్ నగరంలో ఇదే జరిగింది. గచ్చిబౌలి (Gachibowli)లోని ఓ నిర్మాణ సంస్థలో పనిచేస్తున్న యువతిపై ఆటో డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆర్సీపురం నుంచి గచ్చిబౌలి వెళ్లేందుకు యువతి ఆటో ఎక్కింది. అయితే యువతిపై కన్నేసిన ఆ ఆటో డ్రైవర్ ఆమెను నిర్మానుష్య ప్రాంతంలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. అతడితో పాటు ఇంకో వ్యక్తి కూడా ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చీకటి ప్రదేశానికి తీసుకువెళ్లి ఆటోలో ఇద్దరు యువకులు అత్యాచారం చేశారు. మసీద్ బండ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆపై ఆ ఇద్దరు యువకులు అక్కడి నుంచి పరారయ్యారు. ఈ వ్యవహారం పై బాధిత యువతీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనపై ఇద్దరు యువకులు అత్యాచారం చేసారని, అనంతరం ఇద్దరు పారిపోయారని తెలిపింది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి అత్యాచారానికి పాల్పడిన నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Read Also : King Nagarjuna : నాగార్జునని తక్కువ అంచనా వేయకండి..!