Suicide : హైద‌రాబ‌ద్‌లో దారుణం.. గొంతు కోసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకున్న యువ‌కుడు

హైద‌రాబాద్‌లో దారుణం జ‌రిగింది. మానసిక వ్యాధితో బాధపడుతూ.. మద్యానికి బానిసైన యువకుడు గొంతు కోసుకొని..

Published By: HashtagU Telugu Desk
Sucide Imresizer

Sucide Imresizer

హైద‌రాబాద్‌లో దారుణం జ‌రిగింది. మానసిక వ్యాధితో బాధపడుతూ.. మద్యానికి బానిసైన యువకుడు గొంతు కోసుకొని ఆత్మహత్యకు పాల్ప‌డ్డాడు. మణికొండ పంచవటి కాలనీ కి చెందిన తన తల్లి తండ్రులతో కలిసి ఉంటున్న శ్రీరామ్‌(27) అనే వ్య‌క్తి మాదాపూర్ లో ఆటోమొబైల్ గ్యారేజ్ నిర్వహిస్తున్నాడు. గత పది సంవత్సరాలుగా మద్యానికి బానిసగా మారిన శ్రీరామ్‌ మానసికంగా బాధపడుతూ ఇంట్లో తల్లి తండ్రులతో గోడపడేవాడు. ఇంట్లో ని వస్తువులను పగులగొడుతూ,అర్ధరాత్రి వేళ గట్టిగా అరుస్తుండేవాడు. నిన్న బయటకు వెళ్లి మద్యం తాగి ఇంటికి వచ్చిన శ్రీరామ్‌.. ఈరోజు తెల్లవారుజామున తల్లి తండ్రులు నిద్రపోతుండగా వారితో గోడవపడ్డాడు. తన గది నుండి బయటకు వచ్చి కత్తితో శ్రీరామ్ త‌న గొంతును కోసుకున్నాడు. తల్లి తండ్రులు ఆపేందుకు ప్రయత్నించగా వారిని ద‌గ్గ‌ర‌కు రానివ్వ‌లేదు. దీంతో తీవ్ర రక్తస్రావమై అక్క‌డిక‌క్క‌డే శ్రీరామ్ మృతి చెందాడు. మృతుని తల్లి తండ్రులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. పోస్టుమార్ట‌మ్ నిమిత్తం మృత‌దేహాన్ని ఉస్మానియా హాస్పిటల్ కు తరలించారు.

  Last Updated: 13 Oct 2022, 09:44 PM IST