Heart Attack : పెళ్లి వేడుకలో విషాదం..ఊరేగింపులో డాన్స్ చేస్తూ యువకుడు మృతి

గంటల తరబడి డ్యాన్స్‌ చేస్తుండగా అర్ధరాత్రి వేళ ఒక్కసారిగా కుప్పకూలాడు

Published By: HashtagU Telugu Desk
Vijay Dies Heart Attack

Vijay Dies Heart Attack

పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొలనూరులో విషాదకర ఘటన జరిగింది. పెళ్లి ఊరేగింపులో 33 ఏళ్ల యువకుడు (Young Man) డ్యాన్స్‌ చేస్తూ గుండెపోటుతో మృతి చెందాడు. ఈ ఘటన తో ఆ పెళ్లి వేడుకలో విషాదం నెలకొంది. ఇటీవల కాలంలో గుండెపోటు మరణాలు ఎక్కువైపోతున్నాయి. వయసుతో సంబంధం లేకుండా గుండెపోటులు అనేవి వస్తున్నాయి. రెండేళ్ల చిన్నారుల దగ్గరి నుండి 90 ఏళ్ల పెద్దవారి వరకు ఇలా అనేక మంది వరుసగా గుండెపోటుతో మరణిస్తున్నారు. అప్పటివరకు మన మద్యే ఆడుతూపాడుతూ..సంతోషంగా గడిపిన వారు ఒక్కసారిగా కుప్పకూలి మరణిస్తున్నారు. ప్రతిరోజూ ఇలాంటి ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి.

We’re now on WhatsApp. Click to Join.

తాజాగా పెద్దపల్లి (Peddapalli) జిల్లా ఓదెల మండలం కొలనూర్‌ గ్రామంలో ఇదే జరిగింది. కరీంగనర్‌ మండలం తీగలగుట్టపల్లికి చెందిన విజయ్‌కుమార్‌(33) పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం హరిపురంలోని స్నేహితుడి పెండ్లి విందు వేడుకలో పాల్గొనడానికి ఆదివారం సాయంత్రం వచ్చాడు. విందు జరిగిన అనంతరం ఇదే మండలంలోని కొలనూర్‌లో విజయ్‌కుమార్‌ మిత్రుడికి తెలిసిన స్నేహితుడి పెళ్లి ఊరేగింపు రాత్రి జరుగుతుండగా మిత్రుడు పిలవడం తో హాజరయ్యాడు. గంటల తరబడి డ్యాన్స్‌ చేస్తుండగా అర్ధరాత్రి వేళ ఒక్కసారిగా కుప్పకూలాడు. గమనించిన స్థానికులు వెంటనే హాస్పటల్ కు తరలించగా, అప్పటికే గుండెపోటుతో మృతి చెందినట్లు డాక్టర్స్ తెలిపారు. అప్పటివరకు ఆనందంగా అందరితో మాట్లాడిన విజయ్‌ ఇక లేడన్న చేదు నిజాన్ని అతని కుటుంబసభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు.

Read Also : IPL 2024: రోహిత్ తో 2 నెలలుగా మాట్లాడలేదు.. కెప్టెన్సీపై చర్చ అవసరం లేదన్న పాండ్యా

  Last Updated: 18 Mar 2024, 07:47 PM IST