Site icon HashtagU Telugu

Telangana : తెలంగాణ‌లో ఓ పెళ్లి వేడుక‌లో విషాదం.. డ్యాన్స్ చేస్తూనే కుప్ప‌కూలిన య‌వ‌కుడు

Deaths

Deaths

తెలంగాణలో ఓ పెళ్లి వేడుకలో విషాదం చోటుచేసుకుంది. పెళ్లిలో డ్యాన్స్ చేస్తూ యువకుడు మృతి చెంద‌డం అంద‌ర‌ని క‌లచివేసింది. హైదరాబాద్‌కు 200 కిలోమీటర్ల దూరంలోని నిర్మల్ జిల్లా పార్డి గ్రామంలో బంధువు వివాహ రిసెప్షన్‌లో మహారాష్ట్రకు చెందిన ముత్యం నృత్యం చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. యువకుడు పెళ్లి వేడుక‌లో మంచి జోష్ మీద ఉన్నాడు. అతిథుల సమక్షంలో పాట‌కు డ్యాన్స్ చేస్తూ ఉర్రూత‌లుగిస్తున్నాడు. అలా డ్యాన్స్ చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలి స్పృహతప్పి పడిపోయాడు. అతిధులు అతడిని భైంసా ఏరియా ఆసుపత్రికి తరలించగా, అక్కడికి చేరుకునేలోపే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. డ్యాన్స్ చేస్తున్న స‌మ‌యంలో యువకుడికి తీవ్ర గుండెపోటు వచ్చి ఉండవచ్చని వైద్యులు తెలిపారు. నాలుగు రోజుల్లో తెలంగాణలో ఇలాంటి ఘటన జరగడం ఇది రెండోసారి. ఫిబ్రవరి 22న హైదరాబాద్‌లోని జిమ్‌లో వర్కవుట్ చేస్తున్న 24 ఏళ్ల పోలీసు కానిస్టేబుల్ గుండెపోటుతో మరణించాడు.