Hyderabad : జిమ్ చేస్తూ కుప్ప‌కూలిన పోలీస్ కానిస్టేబుల్‌.. వైర‌ల్ అవుతున్న వీడియో

హైదరాబాద్‌లో ఓ యువ పోలీసు కానిస్టేబుల్ జిమ్‌లో వ్యాయామం చేస్తూ అనుమానాస్పదంగా గుండెపోటుతో మృతి చెందాడు.

  • Written By:
  • Publish Date - February 25, 2023 / 07:09 AM IST

హైదరాబాద్‌లో ఓ యువ పోలీసు కానిస్టేబుల్ జిమ్‌లో వ్యాయామం చేస్తూ అనుమానాస్పదంగా గుండెపోటుతో మృతి చెందాడు. యమజాల ధరమ్ విశాల్ (24) గురువారం సాయంత్రం మారేడ్‌పల్లిలోని వ్యాయామశాలలో కుప్పకూలి మృతి చెందాడు. జిమ్‌లోని సీసీటీవీ ఫుటేజీ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో యువకుడు పుషప్స్ చేస్తూ కనిపిస్తున్నాడు. తర్వాత పక్కకు వెళ్లి జిమ్ చేయ‌డం మొదలుపెట్టాడు. కొన్ని సెకన్ల తర్వాత అతను సపోర్ట్ కోసం కొన్ని జిమ్ పరికరాలను పట్టుకుని నేలపై కుప్పకూలినట్లు కనిపించాడు.

జిమ్‌లో ప్లాంక్‌లు, పుషప్‌లు చేస్తూ విశాల్ వర్కవుట్ చేస్తున్నట్లు సీసీటీవీ ఫుటేజీలో ఉంది. జిమ్‌లోని మరికొందరు అత‌న్ని కాపాడేందుకు ప్ర‌య‌త్నించారు. మోహంపై నీళ్లు చల్లినా స్పందన లేదు. దీంతో వెంట‌నే కానిస్టేబుల్ విశాల్‌ని సమీపంలోని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.గుండెపోటుతో మ‌ర‌ణించిట‌న‌ట్లు డాక్ట‌ర్లు తెలిపారు. విశాల్ 2020 బ్యాచ్‌కు చెందిన కానిస్టేబుల్.. రెండేళ్ల క్రితం ఉద్యోగంలో చేరాడు. ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ప‌ని చేస్తున్నాడు. అతనికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని తోటి ఉద్యోగులు చెప్తున్నారు. బోవెన్‌పల్లిలో నివాసముంటున్న విశాల్‌ తన వారపు సెలవులో జిమ్‌కి వెళ్లాడు. అంత‌క‌ముందు రోజు విశాల్ నైట్ డ్యూటీలో ఉన్నాడని స‌హ‌చ‌రులు తెలిపారు.