2025 అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని (Yoga Day 2025) పురస్కరించుకుని హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియం(LB Stadium)లో కౌంట్‌డౌన్ వేడుకలు ఘనంగా నిర్వహించాయి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మలతో పాటు సినీ ప్రముఖులు సాయి ధరమ్ తేజ్, తేజ సజ్జా, ఖుష్బూ, మీనాక్షి చౌదరి తదితరులు పాల్గొన్నారు. యోగా సంస్థలు, విద్యాసంస్థలు, సామాజిక సంస్థలు, సాధారణ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలకు ప్రత్యేకతను కలిపారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. యోగా భారతదేశం నుంచి ప్రపంచానికి అందించిన గొప్ప బహుమతి అని కొనియాడారు.
Nara Bhuvaneswari Birthday : భువనేశ్వరి ప్రేమే మా కుటుంబానికి బలం – చంద్రబాబు ఎమోషనల్ ట్వీట్
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. యోగా అనేది కేవలం ఒక రోజు జరిగే కార్యక్రమం కాదని, ఇది ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలని పిలుపునిచ్చారు. శారీరక, మానసిక ఆరోగ్యానికి యోగం అత్యవసరమని, పని ఒత్తిడిలో ఉన్న యువతరం దీన్ని ఒక మిషన్‌గా తీసుకోవాలని సూచించారు. యోగా వల్ల శాంతి, సమతుల్యత లభిస్తుందని, ఇది ఒక థెరపీ, మెడిసిన్, అన్ని సమస్యలకు రెమిడీ అని తెలిపారు. ఆయన మాట్లాడుతూ యోగా శాస్త్రం మన పూర్వీకుల ఆనవాయితీగా వస్తుందని, వివాదాలకు, రాజకీయాలకు దూరంగా యోగాను ప్రతి ఒక్కరూ ఆచరించాలన్నారు.
PM Modi : నేడు విశాఖకు ప్రధాని మోడీ రాక.. పూర్తి షెడ్యూల్ ఇదే!
ఈ వేడుకల ద్వారా ప్రజలకు యోగా ప్రాముఖ్యతపై అవగాహన కల్పిస్తూ, యోగాభ్యాసం చేయాల్సిన అవసరాన్ని నిపుణులు వివరించారు. విశాఖపట్నంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా పాల్గొనబోతున్న యోగా కార్యక్రమానికి అనేక లక్షలమంది హాజరయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కూడా ఈ సారి యోగాకి పెద్ద ప్రాధాన్యత ఇస్తూ భారీ ఏర్పాట్లు చేసింది. గతంలో కంటే ఈసారి తెలుగు రాష్ట్రాల్లో యోగా పట్ల మరింత ఆసక్తి పెరిగినట్టు స్పష్టంగా కనిపిస్తోంది. యోగాను జీవితంలో భాగంగా మార్చుకుంటే సమాజం ఆరోగ్యవంతంగా మారుతుందని, అందరూ దీనిని ఆచరించాలని కేంద్రం, రాష్ట్రాలు కలసి ముందుకు సాగుతున్నాయి.