Site icon HashtagU Telugu

KTR : కొట్లాట మాకు కొత్తేమీ కాదు..అంటూ ఉద్యమ రోజులను గుర్తు చేసిన కేటీఆర్

Ktr Protest In Assembly

Ktr Protest In Assembly

అసెంబ్లీ ప్రాంగణంలో బైఠాయించి నిరసన తెలిపిన ఘటన.. తెలంగాణ ఉద్యమ రోజులను గుర్తుకు తెచ్చిందని కేటీఆర్ (KTR) చెప్పుకొచ్చారు. ప్రస్తుతం బిఆర్ఎస్ పార్టీ (BRS) కి వరుస షాకులు ఎదురవుతున్నాయి. పదేళ్ల పాటు తిరుగులేని పార్టీ గా ఉన్న బిఆర్ఎస్ నేడు వరుస విమర్శల పాలవుతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి హ్యాట్రిక్ కొడతామని ధీమా చేసిన కేసీఆర్ (KCR)..నేడు ప్రతిపక్ష నేతగా మిగిలిపోయారు. ఇదిలా ఉంటె ఈ పదేళ్లలో బిఆర్ఎస్ పాలనలో జరిగిన అవకతవకలు , స్కామ్ లు ఇవన్నీ బయటపెట్టే పనిలో ఉంది కాంగ్రెస్. ఇప్పటీకే మేడిగడ్డ బ్యారేంజ్ పిల్లర్ కుంగడం ఫై రగడ నడుస్తుంది. దీనికి బాధ్యత కేసీఆర్ వహించాలంటూ అధికార పార్టీ డిమాండ్ చేస్తుంది. దీనిపై ఈరోజు అసెంబ్లీ లో శ్వేతపత్రం సైతం విడుదల చేసేందుకు సిద్ధం అవుతుంది. ఇక నిన్న అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద బిఆర్ఎస్ నేతలకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదు. ఈ క్రమంలో వారంతా రోడ్డు ఫై కుర్చీని నిరసన తెలిపారు.

We’re now on WhatsApp. Click to Join.

‘మాకు కొట్లాట కొత్తేమీ కాదు. గతంలో ఇదే రోడ్ల మీద ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉద్యమం చేశాం. రాష్ట్రాన్ని సాధించిన చరిత్ర మా బీఆర్ఎస్ పార్టీకి ఉంది. జై తెలంగాణ’ అంటూ కేటీఆర్ ఉద్యమ రోజుల ను గుర్తు చేసారు. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టులోని ఒక్క బరాజ్‌లో మూడునాలుగు పిల్లర్లకు ఇబ్బంది కలిగితే వాటిని రిపేర్‌ చేసి రైతులుకు సాగునీరు అందించాలని కోరారు. ప్రస్తుతం 5 వేల క్యూసెక్కుల నీళ్లు కిందికి పోతున్నాయని, మేడిగడ్డ నింపి కాళేశ్వరం పంపింగ్‌ మొదలుపెట్టాలని కోరారు. పొన్నం ప్రభాకర్‌ అంటే తనకు ఎంతో గౌరవం ఉందని, ఆయన ఎంపీగా, తాను ఎమ్మెల్యేగా తొలిసారి గెలిచి 2009 నుంచి కలిసి పని చేశామని పేర్కొన్నారు. పార్లమెంట్‌లో తెలంగాణ కోసం వీరోచితంగా పోరాడిన విషయాన్ని గుర్తు చేశారు. మంత్రిని అవమానించే కుసంస్కారం తనకు లేదని తెలిపారు. కానీ, ఆయన వాస్తవ విరుద్ధ మాటలు చెప్తుంటే తట్టుకోలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు.

Read Also : Electoral Bonds : నేడే సుప్రీంకోర్టులో ఎన్నికల బాండ్ల చెల్లుబాటుపై తీర్పు!