Gandhi Statue : మొన్న బాంబ్ పెట్టారు..నేడు క్షేమపణలు కోరారు

Diwali Shame : ఈ ఘటనకు పాల్పడిన నిందితులు ఈరోజు అదే గాంధీ విగ్రహానికి దండేసి దండం పెడుతూ తమను క్షమించాలని కోరుతూ వీడియోను రిలీజ్ చేశారు

Published By: HashtagU Telugu Desk
Gandhi Statue Diwali

Gandhi Statue Diwali

హైదరాబాద్లోని బోయినపల్లి (Bowenpally ) పరిధిలో దీపావళి సందర్భంగా కొంతమంది ఆకతాయిలు జాతిపిత మహాత్మా గాంధీ (Mahatma Gandhi) విగ్రహాన్ని అవమానించిన సంఘటన తీవ్ర విమర్శలకు దారిత్తిసిన సంగతి తెలిసిందే. విగ్రహం నోట్లో టపాసులు (Burst Crackers) పెట్టి కాల్చి, ఆ ఘటనను వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడం పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేసారు.

ఈ వీడియోను చూసిన పలువురు హైదరాబాద్ సీపీకి ఫిర్యాదులు పంపుతూ.. సుమోటోగా దీనిని స్వీకరించి విగ్రహాన్ని అవమానించిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఘటనకు పాల్పడిన నిందితులు ఈరోజు అదే గాంధీ విగ్రహానికి దండేసి దండం పెడుతూ తమను క్షమించాలని కోరుతూ వీడియోను రిలీజ్ చేశారు. పోలీసులు చర్యలు తీసుకోకముందే స్వచ్ఛందంగా యువకులు ముందుకొచ్చారు. ‘మహాత్మా.. మన్నించు. ఇంకోసారి అలా చేయం’ అని దండం పెట్టారు.

Read Also : Air Pollution : వాయు కాలుష్యం ఊబకాయానికి దారితీస్తుందా..?

  Last Updated: 04 Nov 2024, 07:15 PM IST