Site icon HashtagU Telugu

Weather Updates: వాతావరణ హెచ్చరిక.. తెలంగాణలోని ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్?

Weather Alert

Weather Updates

రెండు తెలుగు రాష్ట్రాలలో ఎండలు మండిపోతున్నాయి. ప్రజలు మధ్యాహ్న సమయంలో ఇంటి నుంచి బయటకు రావాలి అంటేనే భయపడుతున్నారు. ఇది ఇలా ఉంటే ఒకవైపు బానుడు ప్రతాపం చూపిస్తుండగా మరోవైపు తాజాగా తెలంగాణతోని హైదరాబాద్ అలాగే కొన్ని జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. శుక్రవారం ఉదయం కొన్ని ప్రాంతాలలో ఉరుములు మెరుపులు కూడిన వడగండ్ల వానలు పడ్డాయి. హైదరాబాద్ శివారులోని పలు ప్రాంతాల్లో ఉదయం నుంచి మోస్తారు వర్షం కురిసినట్లు తెలుస్తోంది.

ఒకసారిగా కుండ పోతే వర్షాలు కురవడంతో ఇప్పటికే లోతట్టు ప్రాంతాలు అన్నీ కూడా జలమయమయ్యాయి. అంతేకాకుండా కొన్ని రోడ్లపై పెద్ద ఎత్తున నీరు చేరడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అలాగే రంగారెడ్డి హైదరాబాద్,మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి, నాగర్ కర్నూల్, నారాయణపేట జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షంతో ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వానలు పడ్డాయి అని తాజాగా హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రస్తుతం ఎండల వేడి నుంచి ప్రజలకు భారీ వర్షాలు కాస్త ఉపశమనం కలిగించాయి.

హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో గురువారం గరిష్ట ఉష్ణోగ్రత 45 డిగ్రీల సెల్సియస్ గా నమోదు అయినట్లు తెలిపారు. తాజాగా గురువారం కూడా కొన్ని ప్రాంతాలలో మోస్తారు వర్షాలు కురిసాయి. ఇది ఇలా ఉంటే తాజాగా వాతావరణ శాఖ తెలంగాణలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ను జారీ చేసింది. ఉరుములు మెరుపులతో పాటు ఈదురు గాలులతో కూడిన వడగండ్ల వర్షం కురిసే అవకాశం ఉంది అని వాతావరణ శాఖ హెచ్చరించింది. అలాగే గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అలాగే సిద్దిపేట, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్,కామారెడ్డి మహబూబ్నగర్ జిల్లా లకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ.