Site icon HashtagU Telugu

Rain Alert : తెలంగాణలోని 20 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలోని 12 జిల్లాలకు వర్షసూచన

Heavy Rain In Hyderabad

Heavy Rain In Hyderabad

Rain Alert : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో నేటి నుంచి నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలోని 20 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను జారీ చేసింది. మహబూబాబాద్, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, నాగర్ కర్నూల్, మహబూబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్, సిద్దిపేట, మెదక్, వికారాబాద్, జనగామ, హనుమకొండ, వరంగల్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది.  హైదరాబాద్ లో ఆకాశం మేఘావృతమై కనిపించనుంది.

Also read : Gold- Silver Rates: బంగారం కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్.. ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో రేట్స్ ఎలా ఉన్నాయంటే..?

రానున్న 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ లోని కోస్తాలో అనేకచోట్ల, రాయలసీమలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ అల్లూరి సీతారామరాజు జిల్లా, అనకాపల్లి జిల్లా, బాపట్ల జిల్లా, తూర్పుగోదావరి జిల్లా, పార్వతీపురం మన్యం జిల్లా, ప్రకాశం జిల్లా, విజయనగరం జిల్లా, అన్నమయ్య జిల్లా, చిత్తూరు జిల్లా, శ్రీ సత్యసాయి జిల్లా, తిరుపతి జిల్లా, కడప జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు.