Site icon HashtagU Telugu

Yadagirigutta EO Geetha Reddy : యాదాద్రి ఆలయ ఈవో గీతారెడ్డి రాజీనామా

Geethareddy Resign

Geethareddy Resign

యాదగిరి గుట్ట ఆలయ ఈవో గీతారెడ్డి (Yadagirigutta EO Geetha Reddy Resign) తన పదవికి రాజీనామా చేసారు. మొదటి నుండి కూడా గీతారెడ్డి ప్రవర్తన ఫై భక్తులు , పలురాజకీయ పార్టీల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే అప్పటి ప్రభుత్వం ఈ ఆరోపణలను ఎప్పుడూ పట్టించుకోలేదనే భావన స్థానిక ప్రజలలో నెలకొంది. అప్పటి ఎమ్మెల్యే గొంగిడి సునీత సైతం ఈవో పనితీరుపై పలుసార్లు మాజీ సీఎం కేసీఆర్ కు సైతం వివరించినట్లు సమాచారం.

We’re now on WhatsApp. Click to Join.

స్థానిక భక్తులకు రోజువారి దర్శనం లేకుండా కేవలం శనివారం మాత్రమే స్థానిక భక్తులు దర్శనానికి రావాలని, మిగతా రోజులలో మామూలు భక్తుల వల్లే రావాలని నిబంధనలు సైతం స్థానిక ప్రజలను ఆగ్రహానికి గురిచేశాయి. ఆమె పదవీకాలం ముగిసిన తిరిగి పదవి అప్పగించడంతో ఇష్టారాజ్యంతో పలు నిబంధనలు వేధించి ప్రజలను, కింది సిబ్బందిని, భక్తులను అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేసిందని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. ఒక దశలో స్థానిక జర్నలిస్టులకు సైతం అనేక ఆంక్షలు విధించి ఆరోపణలు ఎదుర్కొంది. ఇదే క్రమంలో నాల్గు రోజుల క్రితం ఈవో గీతారెడ్డి, వైటీడీఏ వైస్‌ చైర్మన్లను వెంటనే తొలగించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి గోద శ్రీరాములు డిమాండ్‌ చేశారు. ఇలా అనేక డిమాండ్స్ , విమర్శలు వస్తునం నేపథ్యంలో ఆమె తన పదవికి రాజీనామా చేసినట్లు తెలుస్తుంది.

Read Also : Aravana Payasam: ఎంతో టేస్టీగా ఉండే అరవణి ప్రసాదం ఇంట్లోనే తయారు చేసుకోండిలా?