Yadadri : రికార్డు స్థాయిలో యాదాద్రి నరసింహుడి ఆదాయం…చరిత్రలోనే మొదటిసారిగా కోటికిపైగా..!!

  • Written By:
  • Updated On - November 14, 2022 / 11:30 AM IST

తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకునేందుకు రాష్ట్రం నుంచే కాదు పక్క రాష్ట్రాల నుంచి భక్తులు తరలివస్తుంటారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక…ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ఆలయంపై ప్రత్యేక ద్రుష్టి సారించారు. వేల కోట్లతో ఆలయానికి కొత్తరూపును తీసుకువచ్చారు. ఇప్పుడు చరిత్రలో మొదటిసారిగా స్వామివారి ఆదాయం కోటికి పైగా రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చింది. కార్తీకమాసం ఆదివారం సెలవు దినం కావడంతో భక్తులు పెద్దెత్తున వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఒక్కరోజే 1.09.82.000 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో గీత వెల్లడించారు. ఇప్పటి వరకు యాదాద్రి చరిత్రలో కోటి కి మించిన ఆదాయం రాలేదని ఈవో చెప్పారు.

ఆదివారం తెల్లవారుజామునుంచి భక్తులు యాదాద్రికి చేరుకున్నారు. వేలాది మంది భక్తులతో యాదాద్రి కిక్కిరిసిపోయింది. సుమారు 40వేల మందికిపైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారి ఆర్జిత సేవలోనూ పెద్దెత్తున భక్తులు పాల్గొన్నారు. ఐదురోజుల్లోనే స్వామివారికి కోటి 20లక్షల ఆదాయం వచ్చిందని ఇది నమ్మశక్యం కానీ రీతిలో ఉందని ఆలయాధికారులు తెలిపారు.