Muchintal village: ముచ్చింతల్‌ ముస్తాబవుతోంది!

వెయ్యేళ్ల క్రితం ధరాతలంపై నడయాడిన సమతామూర్తి జగద్గురు శ్రీరామానుజాచార్యులు మళ్లీ మనకు దర్శనమివ్వనున్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండలం ముచ్చింతల్‌లో

  • Written By:
  • Updated On - February 8, 2022 / 12:06 PM IST

వెయ్యేళ్ల క్రితం ధరాతలంపై నడయాడిన సమతామూర్తి జగద్గురు శ్రీరామానుజాచార్యులు మళ్లీ మనకు దర్శనమివ్వనున్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండలం ముచ్చింతల్‌లో 45 ఎకరాల విస్తీర్ణంలో శిల్పకళా శోభితమైన కళ్లు చెదిరే నిర్మాణాలు, పచ్చల కాంతులతో పుడమి నవ్వుతున్నట్లు ఎటు చూసినా మొక్కలతో హాయిగొలిపే పచ్చదనం.. వందకు పైగా ఆలయాల గోపురాలపై దేవతా మూర్తులతో ముచ్చింతల్ ఆకట్టుకోనుంది.

ముచ్చింతల్ లోని శ్రీశ్రీశ్రీ త్రిదండీ చిన్న జీయర్ స్వామి వారి ట్రస్ట్ ప్రాంగణంలో ఏర్పాటు చేస్తున్న రామనుజుల స్వామి వారి విగ్రహం యావత్ భారత దేశాన్ని ఆకర్షించే విదంగా రూపుదిద్దుకుందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. తద్వారా ఈ ప్రాంతం ఆధ్యాత్మిక హబ్ గా మారనుందని ఆయన చెప్పారు. స్వామీ వారి ట్రస్టు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన రామనుజుల స్వామి వారి విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు గాను జరుగుతున్న ఏర్పాట్లను శుక్రవారం సాయంత్రం మంత్రి జగదీష్ రెడ్డి విద్యుత్ శాఖాధికారులతో కలిసి విజిట్ చేశారు. ఫిబ్రవరి 2 నుండి 14 వరకు జరుగు కార్యక్రమలపై శ్రీశ్రీశ్రీ త్రిదండీ చిన్న జీయర్ స్వామితో కలిసి ప్రత్యేకంగా సమీక్షించారు. ప్రధాని తో పాటు ముఖ్యమంత్రులు,గవర్నర్లు వివిధ రాష్ట్రాల నుండి పెద్ద ఎత్తున అధికారులు, అనాధికారులు తరలి రానున్నందున విద్యుత్ ఏర్పాట్లపై పూర్తి స్థాయిలో అధికారులతో ఆయన సమీక్షించారు.

ఏయే తేదీల్లో ఏయే కార్యక్రమాలు

ఫిబ్రవరి 3న: అగ్ని ప్రతిష్ట, అష్టాక్షరి జపం
5 న: ప్రధాని మోదీ రాక, రామానుజాచార్య , మహా విగ్రహావిష్కరణ
8, 9 తేదీల్లో: ధర్మసమ్మేళనం
9 న: ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ రాక
10న: సామాజిక నేతల సమ్మేళనం
11న: సామూహిక ఉపనయనం
12న: విష్ణు సహస్రనామ పారాయణం
13న: రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ రాక
14న: మహా పూర్ణాహుతి