3D Printed Temple: ప్రపంచంలోనే తొలి త్రీడీ ప్రింటెడ్ హిందూ దేవాలయం (3D Printed Temple) తెలంగాణలో నిర్మిస్తున్నారు. సిద్దిపేటలోని బూరుగుపల్లిలో గేటెడ్ విల్లా కమ్యూనిటీ అయిన చరవిత మెడోస్‌లో ఉన్న 3డి ప్రింటెడ్ టెంపుల్ మూడు భాగాల నిర్మాణం. ఇది నగరానికి చెందిన అప్సుజా ఇన్‌ఫ్రాటెక్ ద్వారా 3,800 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించబడింది. ఈ ప్రాజెక్ట్ కోసం అప్సుజా ఇన్‌ఫ్రాటెక్ 3డి ప్రింటెడ్ నిర్మాణ సంస్థ సింప్లిఫోర్జ్ క్రియేషన్స్‌తో జతకట్టింది.
నిర్మాణంలో మూడు గర్భాలయాలు ఉన్నాయి. గణేశుడికి ఒక మోదకం, లార్డ్ శంకర్ కోసం ఒక గోపురం, పార్వతి దేవి కోసం కమలం ఆకారంలో ఉన్న ఇల్లు అని అప్సుజా ఇన్ఫ్రాటెక్ ఎండి హరి కృష్ణ జీడిపల్లి చెప్పారు. ఆసక్తికరంగా సింప్లిఫోర్జ్ క్రియేషన్స్, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్‌తో కలిసి మార్చిలో రెండు గంటలలోపు భారతదేశపు మొట్టమొదటి నమూనా వంతెనను నిర్మించింది.
Also Read: Dwarka Expressway: రూ.9,000 కోట్ల వ్యయంతో ద్వారకా ఎక్స్‌ప్రెస్ వే.. 2024లో అందుబాటులోకి..!
ఐఐటీ హైదరాబాద్‌లోని సివిల్ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ కెవిఎల్ సుబ్రమణ్యం, అతని పరిశోధనా బృందం కాన్సెప్ట్, డిజైన్‌ను అభివృద్ధి చేశారు. దీని తరువాత ఆలయం చుట్టూ ఉన్న తోటలో పాదచారుల వంతెనను నిర్మించారు. ఈ బృందం ఇప్పుడు పార్వతీ దేవికి అంకితం చేయబడిన కమలం ఆకారంలో ఉన్న ఆలయంలో పని చేస్తోంది. “పగోడా, మోదకం పూర్తవడంతో రెండవ దశలో కమలం,పొడవైన శిఖరం (గోపురం) ఉన్నాయి” అని జీడిపల్లి చెప్పారు. గోపురంను మోదకం ఆకారంలో తయారు చేయడం అంత సులువు కాదని, అయితే టీమ్ 10 రోజుల్లో కేవలం 6 గంటల్లో పనిని పూర్తి చేసిందని చెప్పారు.
ఈ త్రీడీ టెంపుల్స్ నిర్మాణం చేయడంలో ముఖ్యఉద్దేశం అత్యంత టెక్నాలజీతో కూడిన కంప్యూటర్ డిజైనింగ్ తో పాటు నిర్మాణం సమయం కూడా కలిసి రావడం. తక్కువ మ్యాన్‌పవర్‌తో అందమైన డిజైన్ రావడం వంటి అంశాల కారణంగా త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీతో రూపొందించాలని ఆలోచన కలిగినట్లు ఇంజనీర్లు చెబుతున్నారు.