World Kamma Mahasabha: ప్రపంచ కమ్మ మహాసభలో చంద్రబాబు, రేవంత్

ప్రపంచ కమ్మ మహాసభకు హైదరాబాద్ కు వేదిక కానుంది. వచ్చే నెలలో హైదరాబాద్‌లో జరగనున్న తొలి ప్రపంచ కమ్మ మహాసభలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకే వేదికను పంచుకోనున్నారు.

World Kamma Mahasabha: ప్రపంచ కమ్మ మహాసభకు హైదరాబాద్ కు వేదిక కానుంది. వచ్చే నెలలో హైదరాబాద్‌లో జరగనున్న తొలి ప్రపంచ కమ్మ మహాసభలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకే వేదికను పంచుకోనున్నారు. కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం జూలై 20-21 తేదీలలో హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (HICC)లో జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కమ్మ సామాజికవర్గ సభ్యులను ఏకం చేయడమే మహాసభ లక్ష్యం.

ఈ కార్యక్రమానికి మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు కూడా ముఖ్య అతిథిగా హాజరవుతారని ఫెడరేషన్ వ్యవస్థాపకులు జెట్టి కుసుమ్ కుమార్ ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీలో చేరకముందు తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పనిచేసిన రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడును తన రాజకీయ గురువుగా భావిస్తారు. ఇప్పుడు తమ తమ తెలుగు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా పనిచేస్తున్న ఇద్దరు నేతలూ ఒకే వేదికను పంచుకోవాలని పరిశీలకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా భారతదేశజనాభాలో 1.5శాతంగా, ప్రపంచవ్యాప్తంగా 2.1కోట్ల మంది కమ్మ సామాజిక వర్గీయులు ఉన్నారు.

Also Read: Kalki First Day Collections : కల్కి 2898AD ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే..?