రూట్స్ కొలీజియం ప్రచారకర్తగా ప్రపంచ చెస్ చాంపియన్ కోనేరు హంపిని ప్రకటించారు. సమగ్ర విద్యను అందించడంలో 30 ఏళ్ల వారసత్వాన్ని వేడుక చేసుకుంటున్న రూట్స్ కొలీజియం తన ప్రచారకర్తను ప్రకటించింది. కోనేరు హంపిని నియమించడం రూట్స్ కొలీజియం బ్రాండ్ ఇమేజ్ ను మరింత పెంచనుంది. ప్రపంచ చెస్ చాంపియన్ కోనేరు హంపిని తన ప్రచారకర్తగా నియమిస్తూ రూట్స్ కొలీజియం మేనేజ్‌మెంట్ సంతకాలు చేసింది. వేగంగా విస్త రిస్తున్న రూట్స్ కొలీజియం 1991లో ప్రారంభించబడింది. ఇంటర్మీడియట్ కోర్సులు, అన్ని బ్యాచిలర్స్ డిగ్రీలను అందిస్తుంది. బిబిఎ, బిబిఎ (బిజినెస్ అనలిటిక్స్), బి.కామ్ (జనరల్, కంప్యూటర్స్, సేల్స్), బిఎ (మాస్ కమ్యూనికేషన్, సైకాలజీ, ఆధునిక భాషలు), బి.ఎస్సీ (డేటా అనాలిసిస్) వంటి అనేక రకాల కోర్సులను రూట్స్ కొలీజియం అందిస్తోంది. డిజైన్, ఫిల్మ్, మీడియా, విజువల్ ఆర్ట్స్, హోటల్ మేనేజ్‌మెంట్, పాకశాస్త్ర కళలు మరియు అనేక ఇతర సర్టిఫికేట్ కోర్సులలో వివిధ కోర్సులను ఈ కళాశాల అందిస్తోంది. తన నియామకంపై కోనేరు హంపీ స్పందిస్తూ.. రూట్స్ కొలీజియం ప్రచారకర్తగ ఉండటం తనకెంతో ఆనందంగా ఉందన్నారు. రూట్స్ కొలీజియం ఒక సంస్థగా గత 30 సంవత్సరాలుగా తన విద్యార్థులకు అత్యుత్తమ విద్యా సౌకర్యాలను అందిస్తోందన్నారు. తనను ప్రచారకర్తగా ఎంచుకున్నందుకు సిబ్బందికి, యాజమాన్యానికి కోనేరు హంపి ధన్యవాదాలు తెలిపారు.
Koneru Humpy : రూట్స్ కొలీజియం ప్రచారకర్తగా ప్రపంచ చెస్ చాంపియన్ కోనేరు హంపి

Koneru Humpy