Wine Shops : వైన్ షాపులను లూటీ చేసిన మహిళలు..

భద్రాద్రి కొత్తగూడెం - ఇల్లందు నియోజకవర్గం టేకులపల్లిలో పేరొందిన బ్రాండ్లు అందుబాటులో లేకుండా కేవలం బెల్ట్ షాపులో అమ్ముతున్నారని..ఒకేసారి 4 వైన్‌ షాపులపై మహిళలు, మందుబాబులు దాడి చేసి..షాప్ లో ఉన్న మద్యాన్ని ఎత్తుకెళ్లారు.

  • Written By:
  • Updated On - March 21, 2024 / 11:58 AM IST

తెలంగాణ (Telangana) లో మద్యానికి (Wines) ఎంత డిమాండ్ ఉందో చెప్పాల్సిన పనిలేదు. తెలంగాణ ప్రభుత్వం నడిచేది మద్యం అమ్మకాలపై. ప్రతి రోజు వందల కోట్లు మద్యం అమ్మకాల ద్వారా ప్రభుత్వ ఖజానాకు వచ్చి పడుతున్నాయి. అందుకే అధికారంలోకి ఏ పార్టీ వచ్చిన మద్యం జోలికి వెళ్లారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రధాన నగరాలతో పాటు మండలాల్లో కూడా భారీ ఎత్తున వైన్ షాప్స్ ఉన్నాయి. కాగా మండలాల్లో ఉన్న వైన్ షాప్స్ ఎక్కువగా బెల్ట్ షాప్స్ కు అనేక రకాల బ్రాండ్ లు అధిక ధరలకు అమ్ముతూ..వైన్ షాప్స్ లో మాత్రం ఊరు పేరు తెలియని బ్రాండ్ లను అమ్ముతూ ఉంటారు.

We’re now on WhatsApp. Click to Join.

తాగేందుకు వచ్చిన వ్యక్తులు..ఏదో ఒకటి అని చెప్పే తాగేసి వెళ్తున్నారు. దీనిపై ఎక్స్జ్ శాఖ కూడా చూసి చూడనట్లు వ్యవహరిస్తుండడం తో వైన్ షాప్స్ యాజమాన్యాలు మరింత రెచ్చిపోతున్నారు. ప్రస్తుతం సమ్మర్ సీజన్ మొదలైంది. ఎండదాహానికి తట్టుకోలేక బీర్ తాగుదామంటే ఏ వైన్ షాప్ లో కూడా తమకు కావాల్సిన బీర్లు లేకపోవడం , బెల్ట్ షాప్ లు అన్ని రకాల బ్రాండ్ లు ఉన్నప్పటికీ అధికార ధర పెట్టి తాగే స్థోమత లేకపోవడం మందుబాబులు వైన్ షాపుల ఫై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వస్తున్నారు.

ఈ క్రమంలో భద్రాద్రి కొత్తగూడెం – ఇల్లందు నియోజకవర్గం టేకులపల్లిలో పేరొందిన బ్రాండ్లు అందుబాటులో లేకుండా కేవలం బెల్ట్ షాపులో అమ్ముతున్నారని.. ఒక్కో బాటిల్‌పై 20 నుంచి 30 రూపాయలు అధికంగా వసూలు చేస్తున్నారని ఒకేసారి 4 వైన్‌ షాపులపై మహిళలు, మందుబాబులు దాడి చేసి..షాప్ లో ఉన్న మద్యాన్ని ఎత్తుకెళ్లారు. దీనికి సంబదించిన వీడియోస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై వైన్ షాప్ యాజమాన్యాలు పోలీసులకు పిర్యాదు చేయడం కేసు నమోదు చేసి విచారణ మొదలుపెట్టారు. ఈ ఘటన ఫై స్థానికులు , మందుబాబులు సపోర్ట్ చేస్తున్నారు.అధిక ధరలకు అమ్మడం వల్లే ఇలా చేసారని..వారు చేసిన దాంట్లో తప్పే లేదని అంటున్నారు.

Read Also : CM Revanth Reddy: రేవంత్ రెడ్డి సోదరుడిపై పోస్ట్, బీఆర్ఎస్ క్రిశాంక్ ఫోన్‌ సీజ్