Women Harassment on Moving Private Bus : దేశ వ్యాప్తంగా మహిళలకు , అభంశుభం తెలియని చిన్నారులకు సైతం రక్షణ అనేది కరువైంది. అర్ధరాత్రి పూట ఒంటరిగా మహిళ వచ్చినప్పుడే మనకు స్వాతంత్రం వచ్చినట్టు అని మహానుభావులు అన్నారు. కానీ అది జరిగేలాలేదు. అర్ధరాత్రి కాదు పట్టపగలే ఒంటరిగా మహిళ (Woman) నడవలేని పరిస్థితి ఉంది. రోడ్ మీదే కాదు ఇంట్లో కూడా ఉండలేని స్థితికి కామాంధులు తీసుకొచ్చారు. ఒంటరి మహిళా కనిపిస్తే చాలు వయసు తో సంబంధం లేకుండా లైంగిక దాడికి పాల్పడుతున్నారు. అంతే ఎందుకు బస్సుల్లో కూడా భద్రత లేకుండా పోతుంది.
ఒంటరిగా ప్రయాణం చేస్తున్న మహిళలపై లైంగిక దాడికి పాల్పడుతున్నారు సదరు బస్సు డ్రైవర్ & క్లినర్స్ (Bus Driver & Cleaner) . ఇప్పటికే పలు ఘటనలు జరుగగా..తాజాగా హైదరాబాద్ ఇదే తరహా ఘటన జరిగింది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ప్రయాణిస్తున్న మహిళపై బస్సు క్లీనర్ లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ సామర్లకోటకు చెందిన మహిళ(28) హైదరాబాద్ (Hyderabad).. కూకట్ పల్లి లో నివాసముంటోంది. స్వగ్రామానికి వెళ్లేందుకు ఈ నెల 18న బస్ బుక్ చేసుకుంది. బస్సు రన్నింగ్లో ఉండగా.. బస్సులో ఉన్న క్లీనర్.. ఆమె ఉన్న సీటు వద్దకు వచ్చాడు. బలవంతంగా ఆమె పై లైంగిక దాడికి పాల్పడ్డాడు. లైంగికదాడికి పాల్పడే సమయంలో ఆమె కేకలు వేసేందుకు ప్రయత్నించగా.. క్లీనర్ బెదిరించాడు. దీంతో ఏం చేయలేని నిస్సాహాయ స్థితిలో ఆ మహిళ ఉండిపోయింది. మహిళ మరుసటి రోజు సామర్లకోటలోని ఇంటికి చేరుకుంది. జరిగిన విషయం కుటుంబ సభ్యులకు చెప్పగా.. ఆమెను తీసుకొని కుటుంబ సభ్యులు చౌటుప్పల్ పోలీస్ స్టేషన్‌లో పిర్యాదు చేసారు. ప్రస్తుతం పోలీసులు సదరు బస్సు క్లినర్ ను పట్టుకునే పనిలో పడ్డారు.
ఈ ఏడాది జులై 31న కూడా ఇలాంటి ఘటనే జరిగింది. ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సులో ఇద్దరు డ్రైవర్లు.. 26 ఏళ్ల యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. బస్సు తెలంగాణలోని నిర్మల్ నుంచి హైదరాబాద్ మీదుగా ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లాకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. చుట్టూ క్లాత్స్ పెట్టి.. యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డారు. ఇలా తరుచు ఘటనలు జరుగుతుండడం తో తల్లిదండ్రులు తమ పిల్లలను ఒంటరిగా ఎటైనా పంపాలంటే భయపడుతున్నారు. మరి ఈ దాడులకు ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుందో చూడాలి.
Read Also : NHRC : EY ఉద్యోగి మరణాన్ని సుమో మోటోగా తీసుకున్న జాతీయ మానవ హక్కుల కమిషన్