Women Fight In Rtc Bus For Seat : భద్రాచలం ఆర్టీసీ బస్సులో మహిళల సిగపట్లు

తెలంగాణ లో అధికారం చేపట్టగానే మహిళలకు ఉచిత బస్సు (Free Bus) ప్రయాణ సౌకర్యం అందజేసి మహిళల్లో సంస్తోశం నింపింది కాంగ్రెస్ పార్టీ (Congress Party). ఈ ఫ్రీ పథకం ప్రారంభమైన దగ్గరి నుండి మహిళలు పెద్ద ఎత్తున బస్సు ప్రయాణాలు చేస్తూ..టీఎస్ ఆర్టీసీకి వంద శాతం ఆక్సుపెన్సీ అందజేస్తున్నారు. అయితే అక్కడక్కడా పలు ఘటనలు మాత్రం ఈ పధకాన్ని తీసుకొచ్చిన కాంగ్రెస్ ఫై విమర్శలు వచ్చేలా చేస్తున్నాయి. We’re now on WhatsApp. Click to […]

Published By: HashtagU Telugu Desk
Bcm Womens Fight

Bcm Womens Fight

తెలంగాణ లో అధికారం చేపట్టగానే మహిళలకు ఉచిత బస్సు (Free Bus) ప్రయాణ సౌకర్యం అందజేసి మహిళల్లో సంస్తోశం నింపింది కాంగ్రెస్ పార్టీ (Congress Party). ఈ ఫ్రీ పథకం ప్రారంభమైన దగ్గరి నుండి మహిళలు పెద్ద ఎత్తున బస్సు ప్రయాణాలు చేస్తూ..టీఎస్ ఆర్టీసీకి వంద శాతం ఆక్సుపెన్సీ అందజేస్తున్నారు. అయితే అక్కడక్కడా పలు ఘటనలు మాత్రం ఈ పధకాన్ని తీసుకొచ్చిన కాంగ్రెస్ ఫై విమర్శలు వచ్చేలా చేస్తున్నాయి.

We’re now on WhatsApp. Click to Join.

మొన్నటికి మొన్న కర్ణాటక (Karnataka) లో ఫ్రీ బస్సు (Free Bus Effect) కారణంగా నడిరోడ్డు ఫై ఇద్దరు మహిళలు జుట్లు పట్టుకొని కొట్టుకున్న (2 Women Fighting) ఘటన సోషల్ మీడియా లో వైరల్ గా మారింది..ఈ ఘటన చూసి చాలామంది తెలంగాణ లో కూడా ఇలాంటిదే జరుగుతుందని అనుకున్నారో లేదో…తాజాగా భద్రాచలం లో ఆ తరహా ఘటనే జరిగింది.

క్రిస్మస్ పండుగ కావటంతో మహిళలు అధిక సంఖ్యలో ప్రయాణాలు కొనసాగించారు. ఈ క్రమంలోనే.. సీట్ల గురించి ఇద్దరు మహిళల మధ్య గొడవ చెలరేగింది. సీటు విషయంలో ఇద్దరు మహిళల మధ్య మొదలైన మాటల యుద్ధం.. సిగపట్లు పట్టేవరకు వచ్చింది. బస్సులో అందరూ చూస్తున్నప్పటికీ.. వాళ్లు మాత్రం ఎక్కడా తగ్గలేదు. ఒకరి జుట్టు ఒకరు పట్టుకుని ఇష్టమున్నట్టు కొట్టుకున్నారు. ఈ గొడవను వీడియో తీసిన కొందరు.. దాన్ని సోషల్ మీడియాలో పెట్టటంతో అది కాస్త వైరల్‌గా మారింది. గతంలోనూ ఇలా కొట్టుకున్న సంఘటనలు ఉన్నా సరే.. అప్పుడు డబ్బులు పెట్టి టికెట్లు తీసుకున్నారు కాబట్టి సరే అనుకోవచ్చు. కానీ.. ఇప్పుడు ఉచిత ప్రయాణం చేస్తున్నప్పుడు కూడా ఇలా కొట్టుకోవటమేంటని నెటిజన్లు కామెంట్స్ వేస్తున్నారు.

Read Also : Komatireddy Venkat Reddy : త్వరలోనే BRS దోపిడీ పత్రం రిలీజ్ చేస్తాం – కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

  Last Updated: 26 Dec 2023, 08:24 PM IST