Site icon HashtagU Telugu

Free Bus Travel: ఉచిత ప్రయాణం కోసం ఒరిజినల్ ప్రూవ్స్ తప్పనిసరి

Free Bus Travel

Free Bus Travel

Free Bus Travel: మహిళా ప్రయాణికులు తమ ఒరిజినల్‌ గుర్తింపు పత్రాలను చూపించాలని తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వీసీ సజ్జనార్‌ తెలిపారు. అలా కాకుండా జిరాక్స్ కాపీలను లేదా ఫోన్ లలో ఫోటోలను చూపించి ప్రయాణం చేయాలని భావిస్తే టికెట్ తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు.

ఒరిజినల్ గుర్తింపు కార్డులను చూపించాలని పదేపదే చెబుతున్నప్పటికీ కొంతమంది తమ స్మార్ట్ ఫోన్‌ల ఫోటోకాపీలు మరియు కలర్ జిరాక్స్‌లను చూపిస్తున్నారని టీఎస్‌ఆర్‌టీసీయాజమాన్యం దృష్టికి వచ్చింది. దీనివల్ల సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు, ప్రయాణ సమయం కూడా పెరుగుతోందని టీఎస్‌ఆర్‌టీసీ చెప్తుంది. అంతేకాకుండా ఇతర రాష్ట్రాల మహిళలు ఫీజు చెల్లించి విధిగా టికెట్ తీసుకుని సహకరించాలని తెలిపారు.

అడ్రస్ ప్రూఫ్ లేని పాన్ కార్డును ఉచిత ప్రయాణానికి ఉపయోగించలేమని ఆయన పేర్కొన్నారు. ఐడి కార్డ్‌లో ప్రయాణికురాలి యొక్క స్పష్టమైన ఫోటో మరియు ఆమె చిరునామా రుజువు ఉండాలని సజ్జనార్ తెలిపారు. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన ఏదైనా అసలు గుర్తింపు కార్డు ఈ పథకానికి వర్తిస్తుంది. పాన్ కార్డుకు చిరునామా లేనందున ఉచిత ప్రయాణానికి చెల్లుబాటు కాదని ఎక్స్‌లో రాశారు.

జీరో టిక్కెట్‌ను జారీ చేయడం ప్రాముఖ్యతపై ఆయన మాట్లాడుతూ జారీ చేసిన జీరో టిక్కెట్ల సంఖ్య ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం టిఎస్‌ఆర్‌టిసికి డబ్బు చెల్లిస్తుందని సజ్జనార్ గుర్తు చేశారు. జీరో టికెట్ లేకుండా ప్రయాణం చేస్తే సంస్థకు నష్టం. కాబట్టి ప్రతి మహిళ కూడా జీరో టికెట్ తీసుకోవాలి. టిక్కెట్టు తీసుకోకుండా ప్రయాణిస్తే..చెకింగ్‌లో గుర్తిస్తే సిబ్బందికి ప్రమాదం. జీరో టికెట్‌ తీసుకోవడానికి నిరాకరిస్తే రూ.500 జరిమానా విధించే అవకాశం ఉందని తెలిపారు.

తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో ప్రకటించిన మహాలక్ష్మి పథకం తెలంగాణ మహిళలకు నెలకు రూ.2500 ఆర్థిక సహాయం, రూ.500కే గ్యాస్ సిలిండర్లు, టిఎస్‌ఆర్‌టిసి బస్సుల్లో ఉచిత ప్రయాణం సహా అనేక ప్రయోజనాలను అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది.మొదటి రెండు వాగ్దానాలు ఇంకా అమలు కానప్పటికీ ప్రభుత్వం ఇప్పటికే టీఎస్‌ఆర్‌టీసీ బస్సులలో ఉచిత ప్రయాణాన్ని ప్రవేశపెట్టింది. మహాలక్ష్మి పథకం ప్రారంభమైనప్పటి నుండి రాష్ట్రంలోని సుమారు 6.50 కోట్ల మంది మహిళలు ప్రభుత్వ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని పొందారు.

Also Read:  Kurchi Thatha : ఆఖరికి ‘కుర్చీ తాత’ను భిక్షాటన చేసుకునేలా చేసారా..?

Exit mobile version