Hyderabad: హైదరాబాద్ లో మహిళలు గంజాయి అమ్ముతూ అరెస్ట్

హైదరాబాద్ లో గంజాయి విక్రయం యధేచ్చగా సాగుతుంది. గంజాయిని అరికట్టేందుకు పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నప్పటికీ విక్రయదారులు ఏ మాత్రం వెనుకాడటం లేదు. కొనేవాళ్ళు ఉన్నంతకాలం అమ్మేవాళ్ళు పుట్టుకొస్తారు అన్న సామెత

Hyderabad: హైదరాబాద్ లో గంజాయి విక్రయం యధేచ్చగా సాగుతుంది. గంజాయిని అరికట్టేందుకు పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నప్పటికీ విక్రయదారులు ఏ మాత్రం వెనుకాడటం లేదు. కొనేవాళ్ళు ఉన్నంతకాలం అమ్మేవాళ్ళు పుట్టుకొస్తారు అన్న సామెతను గంజాయి రాయుళ్లు నిజం చేస్తున్న పరిస్థితి. తాజాగా హైదరాబాద్ లో మహిళలు గంజాయి అమ్ముతూ పట్టుబడ్డారు. దీంతో నగర పోలీస్ వ్యవస్థ అవాక్కయింది.

నానక్రామ్‌గూడలో గంజాయి విక్రయిస్తున్న నలుగురు మహిళలను గచ్చిబౌలి పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టయిన కల్పతి నీతు (45), కలాపతి సిమ్రా (20), కలపతి మమత (55), సురేఖ (40)లు మును సింగ్ వ్యక్తి సహాయంతో ఒడిశా నుండి గంజాయిని కొనుగోలు చేసి లోధా బస్తీలోని విక్రయిస్తున్నారు. నీతు గతంలో ఆరు ఎన్‌డిపిఎస్ కేసుల్లో అరెస్టయింది. పోలీసులు వారిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.

Also Read: Rajinikanth : రజినీకాంత్‌కి రైల్వే కూలీల సాయం.. ఆ కథేంటో తెలుసా..?